కర్ణాటక హసన్ జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ యువతిని బలవంతంగా కొంతమంది కారులోకి తీసుకెళ్లి తాళి కట్టారు. డైరీ సర్కిల్ వద్ద బస్సు కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఆమెను అపహరించారా దుండగులు.
వివరాల్లోకి వెళ్తే.. యువతికి వరుసకు బావ అయిన మను అనే వ్యక్తి ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. తన అత్త కూతురైన ఆ యువతి వివాహానికి నిరాకరించిందన్న కారణంతోనే అపహరించినట్లు సమాచారం. వదిలేయమని ఎంత బతిమాలుకున్నా వినిపించుకోకుండా బలవంతంగా తాళి కట్టాడట ఆ ప్రబుద్ధుడు.