అనువుగాని చోట అధికుల మనరాదు అనే సామెత చక్కగా సరిపోతుంది ఈ పులి పిల్లలకు. మనకు తగని ప్రదేశంలో, మనల్ని మనం గొప్పవారమని చెప్పుకోవడం ఎంతమాత్రం మంచిది కాదు. కానీ ఈ పులి పిల్లలు మాత్రం.... ఓ గిబ్బన్ కోతి ఆవాసంలోకి చొరబడి ఎంచక్కా ఓ కునుకు తీశాయి. అది గమనించిన గిబ్బన్.. పులులకు మర్యాదగా అక్కడి నుంచి వెళ్లాలని తన భాషలో అరచి చెప్పింది.
మాట వినని పులి పిల్లలు అక్కడి నుంచి కదలలేదు. ఆధిక్యతను ప్రదర్శించాలనుకున్న వాటికి తన చేష్టలతో చుక్కలు చూపించింది. వాటి చెవులను మెలితిప్పుతూ ఓ ఆట ఆడుకుంది. చెట్టుపై అటు ఇటూ వేగంగా విన్యాసాలు చేస్తూ... పులిపిల్లలను కాసేపు ఏడిపించింది. కోతి చేష్టలకు విసుగెత్తిన పులులు రెండు అక్కడి నుంచి దూరంగా పారిపోయాయి.