కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్ కరోనా బారినపడ్డారు. తనకు కొవిడ్ సోకినట్టు ఆయన ట్విట్టర్‌లో వెల్లడించారు. స్వీయ నిర్బంధంలో ఉన్నట్టు పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వ్యక్తులు కొవిడ్ నిబంధనల ప్రకారం క్వారంటైన్లో ఉండాలని విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్‌కు కరోనా - ఆజాద్ కాంగ్రెస్ వైరస్
కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్‌కు కరోనా సోకింది. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా నిబంధనల ప్రకారం స్వీయ నిర్బంధంలో ఉండాలని కోరారు.
కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్‌కు కరోనా
సామాన్యులతో పాటు ఇప్పటికే ఉపరాష్ట్రపతి, కొందరు కేంద్రమంత్రులు సహా పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు వైరస్ బారినపడి కోలుకున్నారు.
- ఇదీ చూడండి:పంట వ్యర్థాల దహన నివారణకు ఏకసభ్య కమిటీ