ప్లాస్టిక్‌ను అరికట్టేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కర్ణాటకలోని విజయపుర నగరపాలక అధికారులు. ఇందిరా క్యాంటీన్లను ఏర్పాటు చేసి వాటి ద్వారా ప్లాస్టిక్ సీసాలను సేకరిస్తున్నారు. సీసా ఇస్తే.. టీ ఉచితం అంటూ వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు కృషి చేస్తున్నారు.
విజయపురను ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
"వాడిపడేసిన ప్లాస్టిక్ సీసాలు ఆరోగ్యానికి హాని చేస్తాయి. అలాంటి సీసాలను మేము ఇందిరా క్యాంటీన్‌కు అందిస్తే మాకు ఉచితంగా టీ ఇస్తున్నారు. ఇది నిజంగా మంచి కార్యక్రమం. ప్రతి రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది. ఇక్కడ సేకరించిన సీసాలను సిమెంట్ ఫ్యాక్టరీకి తరలిస్తారు. ఈ కార్యక్రమం చాలా ఉపయోగరకమైనది."