తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వాడిపడేసే మాస్కులను కత్తిరించేయండి'

ఉపయోగించిన మాస్కులు, గ్లౌజులను పేపర్​ బ్యాగుల్లో పెట్టి కనీసం 72 గంటల పాటు ఉంచిన తర్వాతే చెత్త బుట్టలో పడేయాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. ఈ మేరకు నూతన మార్గదర్శకాలను జారీ చేసింది.

General households to cut and store waste masks, gloves for 72 hours before disposing of: CPCB
కొవిడ్​ వ్యర్థాలపై సీపీసీబీ మార్గదర్శకాలు

By

Published : Jul 24, 2020, 7:23 AM IST

కొవిడ్​ వ్యర్థాలకు సంబంధించి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. వైరస్​ ఉన్నా, లేకపోయినా.. ఉపయోగించిన మాస్కులు, గ్లౌజులను కత్తిరించి, కనీసం 72 గంటల పాటు పేపర్​ బ్యాగుల్లో ఉంచిన తర్వాతే వాటిని పడేయాలని పేర్కొంది సీపీసీబీ. ప్రజల నుంచి సేకరించిన పీపీఈ వ్యర్థాలను తొలగించేటప్పుడు కూడా ఇదే విధంగా చర్యలు చేపట్టాలని మాల్స్​, వాణిజ్య సముదాయాలకు సూచించింది.

"సాధారణ గృహాల్లో.. ఉపయోగించిన మాస్కులు, గ్లౌజులను పేపర్​ బ్యాగులో కనీసం 72గంటల పాటు ఉంచాలి. అనంతరం వాటిని పొడి ఘన వ్యర్థాలుగా పడేయ్యాలి. పునర్వినియోగించకుండా.. వాటిని కత్తిరించాలి. వాణిజ్య సముదాయాలు, షాపింగ్​ మాళ్లు, సంస్థలు, కార్యాలయాల్లో ప్రజల నుంచి సేకరించిన పీపీఈలను ఇదే విధంగా 3రోజుల పాటు భద్రపరిచి.. పొడి ఘన వ్యర్థాలుగా పడేయాలి."

--- సీపీసీబీ మార్గదర్శకాలు.

మరోవైపు కరోనా బాధితులు తిన్నాక మిగిలిపోయిన భోజనం, వారు ఖాళీ సీసాలను బయోమెడికల్​ వ్యర్థాలుగా పరిగణించకూడదని.. వాటిని కూడా ఇతర సాధారణ ఘన వ్యర్థాలతో కలిపి సేకరించాలని స్పష్టం చేసింది సీపీసీబీ. అనంతరం వాటిని బ్యాగుల్లో పెట్టి.. ఆ బ్యాగులను తాళ్లతో కట్టేయాలని పేర్కొంది.

"వ్యర్థాలను తగ్గించేందుకు.. కరోనా బాధితులకు భోజనం పెట్టేడప్పుడు, పునర్వినియోగించలేని వస్తువులను వాడాలి. అది కూడా ఆసుపత్రి మార్గదర్శకాలను అనుసరిస్తూ వాటిని ఉపయోగించాలి. అది కుదరకపోతే.. బయో-డీగ్రేడబుల్ వస్తువులను వాడాలి. అనంతరం తడి-పొడి ఘన వ్యర్థాలను బ్యాగుల్లో పెట్టి వాటిని కట్టేయాలి."

--- సీపీసీబీ మార్గదర్శకాలు.

తాత్కాలిక ఆరోగ్య కేంద్రాలు సహా ఐసోలేషన్​ వార్డుల్లో కొవిడ్​ వ్యర్థాల కోసం ప్రత్యేకంగా చెత్తబుట్టలను పెట్టాలని సూచించింది సీపీసీబీ.

ఇదీ చూడండి:-రికవరీలో రికార్డ్- ఒక్కరోజులో 29 వేల మందికి విముక్తి

ABOUT THE AUTHOR

...view details