గుర్తు తెలియని వ్యక్తులు ఓ వ్యాపారి ఇంట్లోకి విసిరిన జిలెటిన్ స్టిక్స్‌ను... బాంబ్ స్క్వాడ్ విజయవంతంగా నిర్వీర్యం చేసిన ఘటన ఝార్ఖండ్ బొకారా సెక్టార్ 12లో జరిగింది. వినయ్ కుమార్ డే అనే ఫర్నిచర్ వ్యాపారి ఇంట్లోకి... కొందరు దుండగులు బాంబు విసిరేసి వెళ్లిపోయారు.
"బయట ఏదో శబ్దం వినిపించి బయటకు వచ్చాను. బహుశా మామిడి పండు పడి ఉంటుందని అనుకున్నాను. అయితే ఎదురుగా ఓ బొమ్మ కనిపించింది. ఇది చూడడానికి కాస్త అనుమానాస్పదంగా కనిపించింది. ఇది చూసిన మా నాన్న ఇదేదో ప్రమాదకరమైన వస్తువులా ఉందని అన్నారు. దీనితో దానిని ఇంటి బయట పడేశాను. తరువాత పోలీసులకు ఫిర్యాదు చేశాను."
- వినయ్ కుమార్, ఫర్నిచర్ వ్యాపారి
వినయ్ కుమార్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సీఐఎస్ఎఫ్ స్క్వాడ్... ఆ బొమ్మలో పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే రాంచీ బాంబు స్క్వాడ్‌కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న స్క్వాడ్... మరుసటి రోజు ఉదయం ఆ బాంబును విజయవంతంగా నిర్వీర్యం చేసింది.