దిల్లీలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్న వేళ.. టెస్టుల వేగాన్ని పెంచాలని ఆసుపత్రులు, ల్యాబ్‌లను ఆదేశించింది దిల్లీ ప్రభుత్వం. కొవిడ్ పరీక్షల సామర్థ్యాన్ని పెంచి, 48 గంటల్లోగా ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది.
"దిల్లీలో కరోనా కేసులు పేరుకుపోతున్న వేళ... కొవిడ్-19 టెస్టింగ్ సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించాం. ప్రైవేట్ ల్యాబ్‌లకు నమూనాలను పంపడానికి ఇక్కడ ఎటువంటి పరిమితులు విధించలేదు. అవి నిర్ణీత కాలపరిమితిలో పరీక్షలు చేపట్టాలి. అంటే గరిష్ఠంగా 24 గంటల నుంచి 48 గంటల్లో పరీక్ష ప్రక్రియను పూర్తి చేయాలి. నమూనాలను ఐసీఎమ్ఆర్ నిబంధనలకు కట్టుబడి సేకరించాలి. ఆర్టీ పీసీఆర్ అప్లికేషన్ ఉపయోగించకుండా ఎటువంటి నమూనాను తీసుకోకూడదు"
-పద్మిణి సింగ్లా, దిల్లీ ఆరోగ్య శాఖ కార్యదర్శి