కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశంసలు కురిపించారు. భాజపాలో ధైర్యమున్న నేత గడ్కరీ మాత్రమేనని రాహుల్ అభివర్ణంచారు. రఫేల్పైనా గడ్కరీ స్పందించాలని కోరారు రాహుల్.
గడ్కరీపై రాహుల్ ప్రశంసలు..! - గడ్కరీ
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశంసించారు
రాహుల్ గాంధీ
"గడ్కరీ గారు! అభినందనలు. భాజపాలో ఉన్న వారిలో మీరు మాత్రమే ధైర్యవంతులు. రఫేల్ కుంభకోణం, అనిల్ అంబానీ, రైతు సమస్యలు, వ్యవస్థల్ని నిర్వీర్యం చేయడంపైనా మీరు స్పందించండి"-ట్విట్టర్లో రాహుల్ గాంధీ
ఇంటిని చక్కదిద్దలేని వారు దేశాన్ని బాగుచేయలేరని నాగ్‌పూర్‌లో జరిగిన ఏబీవీపీ సమావేశంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.