తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'చెత్త కేఫ్'​ షురూ- కిలో ప్లాస్టిక్​కు భోజనం, అరకిలోకు టిఫిన్​ - గార్బేజ్​ కేఫ్

ఆ కేఫ్​లో ఎంత కావాలన్నా తినొచ్చు. బిల్లు గురించి భయపడనక్కర్లేదు. అవును ఒక్కపైసా కూడా చెల్లించక్కర్లేదు. ప్లాస్టిక్ వ్యర్థాలన ఇస్తే చాలు... ఉచితంగా కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తారు. ఎంత చెత్త ఇస్తే అంత తిండి!

'చెత్త కేఫ్'​ షురూ- కిలో ప్లాస్టిక్​కు భోజనం, అరకిలోకు టిఫిన్​

By

Published : Oct 10, 2019, 7:01 AM IST

'చెత్త కేఫ్'​ షురూ- కిలో ప్లాస్టిక్​కు భోజనం, అరకిలోకు టిఫిన్​
ఛత్తీస్​గఢ్​లోని అంబికాపుర్‌ పురపాలక సంస్థ నిరాశ్రయుల కోసం దేశంలోనే తొలిసారిగా గార్బేజ్ (చెత్త) కేఫ్ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఆ రాష్ట్ర ఆరోగ్య, పంచాయతీ రాజ్​ మంత్రి టీఎస్​ సింహ దేవ్​ చేతుల మీదుగా ఈ గార్బేజ్​ కేఫ్​ ప్రారంభమైంది.

చెత్తకు తగ్గ భోజనం

ఈ కేఫ్​కు డబ్బులు తీసుకుని వెళ్లాల్సిన పని లేదు. కానీ, చేతి నిండా ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకువెళ్లాలి. ఒక కిలో ప్లాస్టిక్ వ్యర్థాన్ని తెచ్చిస్తే భోజనం, అరకిలో ప్లాస్టిక్ తెచ్చిస్తే అల్పాహారం పెడతారు.

ప్లాస్టిక్​ వ్యర్థాలను సేకరించి, నగరాన్ని పరిశుభ్రంగా మార్చాలన్నది... ఈ కేఫ్​ ఏర్పాటు వెనుక ఉద్దేశం. ఇలా సేకరించే ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్లు నిర్మిస్తామని మేయర్ అజయ్ తిర్కే తెలిపారు. ఇప్పటికే 8 లక్షల ప్లాస్టిక్ బ్యాగ్‌లను ఉపయోగించి నగరంలో ఒక రోడ్డును నిర్మించారు కూడా.

నాణ్యత

ఈ గార్బేజ్​ కేఫ్​లో చెత్త తీసుకుంటున్నారు కదా అని ఆహారం కూడా అలానే ఉంటుందని అనుకోవద్దు. నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్నే వినియోగదారులకు అందిస్తున్నారు.
మంచి రెస్టారెంట్​లాగా హుందాగా నిర్మించేసరికి చూసేందుకు వచ్చిన జనంతో మొదటి రోజే కేఫ్​ రద్దీగా మారింది.

ఇదీ చూడండి:విమానంలో ఎంపీకి 'పెంకుల' ఆమ్లెట్‌, పాడైన ఆలూ

ABOUT THE AUTHOR

...view details