తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'క్రిమినల్​ పోయాడు.. మరి కేసు సంగతేంటి?'

dubey
గ్యాంగ్​స్టర్ వికాస్ దూబే ఎన్​కౌంటర్

By

Published : Jul 10, 2020, 7:42 AM IST

Updated : Jul 10, 2020, 12:44 PM IST

12:43 July 10

ఉత్తర్​ప్రదేశ్‌లో తనను పట్టుకునేందుకు వచ్చిన పోలీసులపై కాల్పులకు తెగబడి.. ఎనిమిది మందిని బలిగొన్న గ్యాంగ్‌స్టర్ వికాస్‌ దుబే కథ ముగిసింది. యూపీలోని కాన్పుర్‌కు సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు హతమయ్యాడు.

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిన్​లో గురువారం అరెస్టయిన దుబేను.. పోలీసులు కాన్పూర్‌ తరలిస్తుండగా వాహనం బోల్తా పడింది. ఇదే అదునుగా భద్రతా సిబ్బంది నుంచి తుపాకీ లాక్కొని కాల్పులు జరపగా.. ఆత్మరక్షణ కోసం తాము జరిపిన ఎదురుకాల్పుల్లో దుబే చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. దుబే జరిపిన కాల్పుల్లో నలుగురు భద్రతా సిబ్బంది కూడా గాయపడినట్లు వెల్లడించారు.

కరుడుగట్టిన నేరగాడు...

తన గ్యాంగ్​తో ఉత్తర్​ప్రదేశ్​లో ఎన్నో దురాగతాలకు పాల్పడ్డాడు వికాస్​. బెదిరింపులు, దౌర్జన్యాలు, అపహరణలు, దోపిడీలు, హత్యలతో ఎన్నో కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. 20 ఏళ్ల కిందటి భాజపా నేత హత్య కేసులోనూ ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఇతడిపై 60కిపైగా క్రిమినల్​ కేసులున్నాయి.

ఈ నెల 3న అర్ధరాత్రి.. చౌబేపుర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని బిక్రూ గ్రామంలో తనను పట్టుకునేందుకు వచ్చిన పోలీసు బృందంపై విచక్షణారహితంగా కాల్పులు జరిపింది వికాస్​ ముఠా. ఈ ఘటనలో అక్కడికక్కడే 8 మంది పోలీసులు చనిపోయారు. మరికొందరు గాయపడ్డారు. గంటల వ్యవధిలోనే ఇద్దరు దుబే అనుచరులనూ పోలీసులు ఎన్​కౌంటర్​లో హతమార్చారు.

ఇదీ చూడండి:రౌడీషీటర్ల దాడిలో 8 మంది పోలీసులు మృతి

అలా దొరికాడు...

వికాస్​ కోసం ప్రత్యేక బృందాలను నియమించి గాలింపు చేపట్టింది యూపీ ప్రభుత్వం. ఈ క్రమంలో అతని ప్రధాన అనుచరుడు అమర్​ దుబేను బుధవారం మట్టుబెట్టారు పోలీసులు. మధ్యప్రదేశ్​ ఉజ్జయిన్​లో దుబే అరెస్టయ్యే కొద్దిసమయం ముందు మరో ఇద్దరు అనుచరులను ఎన్​కౌంటర్​ చేశారు. ఇప్పటివరకు ఈ కేసులో దుబే సహా ఆరుగురు హతమయ్యారు. దుబే తలపై రూ. 5 లక్షల రివార్డు ఉంది.

అరెస్టుకు ముందుకు వికాస్‌ దుబే పోలీసులకు చిక్కకుండా ముప్పుతిప్పలు పెట్టాడు. బిక్రూలో పోలీసుల్ని బలితీసుకున్న ఘటన తర్వాత కాన్పుర్‌ నుంచి రాజస్థాన్‌లోని కోటా మీదుగా 1500 కిలోమీటర్లు ప్రయాణించి, హరియాణాలోని ఫరీదాబాద్‌ చేరుకున్నాడు. అక్కడ పోలీసులకు చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నాడు. ఆ తర్వాత మధ్యప్రదేశ్​లోని ఉజ్జయిన్‌ వచ్చాడు. ఇద్దరు అనుచరులతో కలిసి అతడు మధ్యప్రదేశ్‌ చేరుకున్నాడు. ఎట్టకేలకు ఉజ్జయిన్‌ నగరంలోని మహాకాలేశ్వరుడి ఆలయం వద్ద గురువారం దొరికాడు. దుబే అనుచరులిద్దరు కూడా పట్టుబడ్డారు.

ఇదీ చూడండి:రెండు రాష్ట్రాలు దాటి ఉజ్జయిన్​కు దూబే.. ఎలా?

రాజకీయ విమర్శలు...

వికాస్​ అరెస్టు తర్వాత యోగి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన విపక్షాలు ఎన్​కౌంటర్​ అనంతరం.. మరింత దూకుడు పెంచాయి.

ఇదీ చూడండి:'గ్యాంగ్​స్టర్​ వికాస్​ కేసును సీబీఐకి అప్పగించాలి'

'క్రిమినల్​ చనిపోయాడు.. మరి అతడిని రక్షించిన వారి సంగతేంటి?' అంటూ ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు కాంగ్రెస్​ నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. అంతకుముందు గురువారం వికాస్​ అరెస్టైన అనంతరం.. ఈ కేసు విచారణను సీబీఐ అప్పగించాలని, వాస్తవాలు బయటకు తీయాలని డిమాండ్​ చేశారు. వికాస్​ కేసులో యోగి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

ఎన్​కౌంటర్​కు ముందు వాస్తవానికి కారు బోల్తాపడలేదని అన్నారు సమాజ్​వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్​ యాదవ్​. నిజాలు బయటకు వస్తే ప్రభుత్వం కూలిపోతుందన్న భయంతో చేసిన ప్రయత్నం అని యూపీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు.

12:37 July 10

'ఆ పోలీసుల పరిస్థితి నిలకడగా ఉంది'

ఎన్​కౌంటర్​లో గాయపడిన ముగ్గురు పోలీసుల పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు వైద్యులు. వారి శరీరం నుంచి బుల్లెట్లు తొలగించినట్లు స్పష్టం చేశారు. 

వికాస్​ ఛాతీలోకి 3, భుజంపై ఒక బుల్లెట్లు దిగాయని వెల్లడించారు. 

12:35 July 10

రాజకీయ విమర్శలు..

వికాస్​ అరెస్టు తర్వాత యోగి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన విపక్షాలు ఎన్​కౌంటర్​ అనంతరం.. మరింత దూకుడు పెంచాయి.  

'క్రిమినల్​ చనిపోయాడు.. మరి అతడిని రక్షించిన వారి సంగతేంటి?' అంటూ ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు కాంగ్రెస్​ నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. అంతకుముందు గురువారం వికాస్​ అరెస్టైన అనంతరం.. ఈ కేసు విచారణను సీబీఐ అప్పగించాలని, వాస్తవాలు బయటకు తీయాలని డిమాండ్​ చేశారు. వికాస్​ కేసులో యోగీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.  

ఎన్​కౌంటర్​కు ముందు వాస్తవానికి కారు బోల్తాపడలేదని అన్నారు సమాజ్​వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్​ యాదవ్​. నిజాలు బయటకు వస్తే ప్రభుత్వం కూలిపోతుందన్న భయంతో చేసిన ప్రయత్నం అని యూపీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు.  

10:30 July 10

ఎన్​కౌంటర్​లో నలుగురు పోలీసులకు గాయాలు

దుబే ఎన్​కౌంటర్​లో నలుగురు పోలీసులకు గాయాలయ్యాయి. వీరిని మధ్యప్రదేశ్ నుంచి యూపీలోని లాలాలజపత్​ రాయ్ ఆస్పత్రికి తరలించారు.  

09:51 July 10

ఉత్తర్‌ప్రదేశ్‌లో 8 మంది పోలీసులను పొట్టన పెట్టుకున్న కరడుగట్టిన నేర ముఠా నాయకుడు వికాస్‌ దుబే పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గురువారం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిన్‌ నగరంలో పట్టుబడ్డ వికాస్‌ను నేడు ఉదయం ఉత్తర్‌ప్రదేశ్‌ స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కాన్పూర్‌కు తరలించేందుకు బయలుదేరారు. ఈ క్రమంలో మార్గమధ్యంలో కాన్వాయ్‌లోని ఓ వాహనం బోల్తాపడింది. దీన్ని అదునుగా భావించిన అతడు ఓ పోలీసు తుపాకిని లాక్కొని పారిపోయేందుకు యత్నించాడు. లొంగిపోవాలన్న పోలీసుల ఆదేశాల్ని బేఖాతరు చేశాడు. పైగా పోలీసుల పైకి కాల్పులకు తెగబడ్డాడు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడ్డ అతణ్ని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

కారు బోల్తా పడ్డ ఘటనలో నలుగురు పోలీసులు గాయపడ్డట్లు కాన్పూర్‌ ఐజీ మోహిత్‌ అగర్వాల్‌ తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే దుబే అనుచరులు కార్తికేయ, ప్రవీణ్‌ అలియాస్‌ బౌవా దుబే గురువారం పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. కార్తికేయను బుధవారం అరెస్టు చేశారు. అతడిని ట్రాన్సిట్‌ రిమాండ్‌పై కాన్పుర్‌ తీసుకొస్తున్నప్పుడు మార్గమధ్యంలో వాహనం టైరు పంక్చరైందని పోలీసు అధికారులు తెలిపారు. ఇదే అదునుగా అతడు పోలీసుల నుంచి తుపాకి లాక్కొని పరారయ్యేందుకు ప్రయత్నించాడని చెప్పారు. ఈ క్రమంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడని తెలిపారు.  ప్రవీణ్‌ను ఇటావా వద్ద జరిగిన ఒక ఎన్‌కౌంటర్‌లో పోలీసులు హతమార్చారు. మొత్తం మీద కాన్పూర్‌ సమీపంలోని బిక్రులో ఎనిమిది మంది పోలీసులు హతమైన నాటి నుంచి వికాస్‌ దుబేతో సహా ఈ కేసుతో సంబంధం ఉన్న ఆరుగురు హతమయ్యారు.

అరెస్టుకు ముందుకు వికాస్‌ దుబే పోలీసులకు చిక్కకుండా ముప్పు తిప్పలు పెట్టాడు. బిక్రులో పోలీసుల్ని బలితీసుకున్న ఘటన తర్వాత కాన్పూర్‌ నుంచి రాజస్థాన్‌లోని కోట మీదుగా 1500 కిలోమీటర్లు ప్రయాణించి, హరియాణాలోని ఫరీదాబాద్‌ చేరుకున్నాడు. అక్కడ పోలీసులకు చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నారు. ఆ తర్వాత ఉజ్జయిన్‌ వచ్చాడు. ఇద్దరు అనుచరులతో కలిసి అతడు మధ్యప్రదేశ్‌ చేరుకున్నాడు. ఎట్టకేలకు గురువారం ఉజ్జయిన్‌ నగరంలోని మహాకాలేశ్వరుడి ఆలయం వద్ద దొరికాడు. దుబే అనుచరులిద్దరు కూడా పట్టుబడ్డారు.

గత శుక్రవారం రాత్రి కాన్పూర్‌కు సమీపంలోని బిక్రు గ్రామంలో తనను అరెస్టు చేయడానికి వస్తున్న పోలీసు బృందంపై దుబే, అతడి అనుచరులు ఆకస్మికంగా కాల్పులు జరిపి, ఒక డీఎస్పీ సహా 8 మంది పోలీసులను బలితీసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అతడు పరారీలో ఉన్నాడు. దుబే గురించి సమాచారం ఇచ్చినవారికి రూ.5 లక్షల రివార్డు కూడా ప్రకటించారు. అతడిపై హత్యా నేరాలు సహా 60 క్రిమినల్‌ కేసులు ఉన్నాయి.

ఇదీ చూడండి:ఎన్​కౌంటర్​లో ఇద్దరు 'దూబే' అనుచరులు హతం 

రౌడీషీటర్ల దాడిలో 8 మంది పోలీసులు మృతి 

ఎన్​కౌంటర్​లో 'దూబే' ప్రధాన అనుచరుడు హతం

దూబే కోసం పోలీసుల వేట- రౌడీషీటర్ ఇల్లు కూల్చివేత
 

08:13 July 10

ఉత్తర్​ప్రదేశ్​లో ఎనిమిదిమంది పోలీసుల మృతికి కారణమైన గ్యాంగ్​స్టర్ వికాస్ దుబే పోలీస్ ఎన్​కౌంటర్​లో హతమయ్యాడు.  

మధ్యప్రదేశ్ ఉజ్జయిని​లో గురువారం పోలీసులకు చిక్కాడు దుబే. శుక్రవారం కాన్పుర్​కు తరలిస్తుండగా.. కాప్రా ప్రాంతంలో పోలీసుల వద్ద నుంచి తుపాకి లాక్కునేందుకు యత్నించాడు దుబే. ఈ పెనుగులాటలో వాహనం బోల్తా పడింది. అనంతరం ఇరువర్గాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసుల పైకి కాల్పులు జరుపుతూనే పారిపోయేందుకు విఫలయత్నం చేశాడు దుబే. ఈ క్రమంలో పోలీసుల జరిపిన కాల్పుల్లో యూపీ గ్యాంగ్​స్టర్​ మరణించాడు. ఘటనలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి.  

వాస్తవానికి కాన్పుర్ కోర్టులో శుక్రవారం వికాస్​ను హాజరుపర్చాల్సి ఉంది. ఈ నేపథ్యంలో యూపీకి తీసుకెళ్తున్న క్రమంలో జరిగిన ఎన్​కౌంటర్​తో దుబే కథ అంతమయింది.  

ఈ నెల 3న తనను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులపై వికాస్ గ్యాంగ్ కాల్పులు జరిపింది. ఈఘటనలో తమ సహచరులు అమరులైన నేపథ్యంలో దుబే కోసం తీవ్రంగా గాలించారు యూపీ పోలీసులు. 

బుధవారం హామీర్​పుర్ వద్ద జరిగిన ఎన్​కౌంటర్​లో వికాస్ ప్రధాన అనుచరుడు అమర్ దుబే హతమయ్యాడు. గురువారం కాన్పూర్, ఎటావాలో జరిగిన రెండు వేర్వేరు ఎన్​కౌంటర్లలో మరో ఇద్దరు అనుచరులు ప్రభాత్ మిశ్రా, బహువా దూబేలను మట్టుబెట్టారు.

ఇదీ చూడండి:ఎన్​కౌంటర్​లో ఇద్దరు 'దూబే' అనుచరులు హతం 

రౌడీషీటర్ల దాడిలో 8 మంది పోలీసులు మృతి 

ఎన్​కౌంటర్​లో 'దూబే' ప్రధాన అనుచరుడు హతం

దూబే కోసం పోలీసుల వేట- రౌడీషీటర్ ఇల్లు కూల్చివేత
 

07:38 July 10

గ్యాంగ్​స్టర్ వికాస్ దుబే ఎన్​కౌంటర్

ఉత్తర్​ప్రదేశ్​లో ఎనిమిదిమంది పోలీసుల మృతికి కారణమైన గ్యాంగ్​స్టర్ వికాస్ దుబే ఎన్​కౌంటర్​లో ప్రాణాలు కోల్పోయాడు. గురువారం మధ్యప్రదేశ్​లో చిక్కిన వికాస్​ దుబేను వెనక్కి తీసుకొస్తుండగా పోలీసులకు, దుబేకు మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మృతి చెందాడు దుబే.

Last Updated : Jul 10, 2020, 12:44 PM IST

ABOUT THE AUTHOR

...view details