తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎన్​కౌంటర్​లో 'దూబే' ప్రధాన అనుచరుడు హతం

కాన్పూర్​ ఎన్​కౌంటర్​లో ప్రధాన నిందితుడు, రౌడీషీటర్​ వికాస్​ దూబే ప్రధాన అనుచరుడిని ఉత్తర్​ప్రదేశ్​ పోలీసులు హతమార్చారు. మరో నిందితుడిని అరెస్టు చేశారు. వికాస్​ దూబే కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు పోలీసులు.

Gangster Vikas Dubey aide killed by STF
టాస్కఫోర్స్​ కాల్పుల్లో దూబే అనుచరుడు మృతి

By

Published : Jul 8, 2020, 9:35 AM IST

Updated : Jul 8, 2020, 12:16 PM IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాన్పూర్‌ ఎన్‌కౌంటర్‌కు కారణమైన వికాస్‌ దూబే ప్రధాన అనుచరుడు అమల్‌ దూబేని ఉత్తర్​ప్రదేశ్​ పోలీసులు హతమార్చారు. తెల్లవారుజామున హామీర్‌పూర్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అమర్‌ దూబేను పోలీసులు మట్టుబెట్టారు. మరో నిందితుడు శ్యాము బాజ్‌పాయ్‌ను అరెస్టు చేశారు.

పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వికాస్‌ దూబేను కొద్ది రోజుల క్రితం అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు ఆయన అనుచరులు. గత వారం కాన్పూర్‌ సమీపంలోని బిక్రూ వద్ద జరిగిన ఈ ఘటనలో డీఎస్పీ సహా 8 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఉత్తర్‌ప్రదేశ్‌ సర్కార్‌... దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది.

వికాస్‌ దూబే ఆచూకీ చెప్పిన వారికి రెండున్నర లక్షల రివార్డు అందిస్తామని.. పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. ప్రత్యేక బృందాలు త్వరలోనే వికాస్‌ను అరెస్టు చేస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

దూబే అనుచరులు వీరే..

వికాస్​ దూబే అనుచరుల ఫొటోను విడుదల చేశారు పోలీసులు. దుబే సన్నిహితుడు జై బాజ్‌పేయి నివాసంపై కూడా దాడి చేశారు. భారీ స్థాయిలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

ఎన్​కౌంటర్​లో 'దూబే' ప్రధాన అనుచరుడు హతం

ఇదీ చూడండి:భారత్ లక్ష్యంగా పాక్ సైన్యం కాల్పులు.. ఒకరు మృతి

Last Updated : Jul 8, 2020, 12:16 PM IST

ABOUT THE AUTHOR

...view details