తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యువ వైద్యురాలి ఆత్మ శాంతి కోసం గంగా హారతి - హత్యాచారం

హైదరాబాద్​ షాద్​నగర్​లో మృగాళ్ల చేతిలో బలైపోయిన యువ వైద్యురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ఉత్తర్​ప్రదేశ్​లోని వారణాసిలో గంగా హారతి చేపట్టారు. గంగామాతకు ప్రత్యేక పూజలు చేశారు.

ganga aarti
పశువైద్యురాలి ఆత్మకు శాంతి చేకూరాలని కాశీలో గంగాహారతి

By

Published : Dec 1, 2019, 9:50 AM IST

Updated : Dec 1, 2019, 12:16 PM IST

యువ వైద్యురాలి ఆత్మ శాంతి కోసం గంగా హారతి

హైదరాబాద్​ షాద్​నగర్​లో పశు వైద్యురాలి హత్యాచారంపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు చెలరేగాయి. పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు ప్రజలు. వైద్యురాలి ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వత్తుల ర్యాలీలు నిర్వహించారు. ఉత్తర్​ప్రదేశ్​ వారిణాసిలో గంగోత్రి సేవా సమితి, ఆగమన్​ సంస్థ ఆధ్వర్యంలో ప్రతి రోజూ నిర్వహించే గంగా హారతిలో యువతికి నివాళులర్పించారు.

గంగా హారతికి ముందు వైద్యురాలి ఆత్మ శాంతి కోసం రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. గంగామాతకు ప్రార్థనలు చేశారు. విదేశాల నుంచి వచ్చిన యాత్రికులూ యువతిపై జరిగిన అమానుష చర్య గురించి తెలిసి ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలికి అశ్రునయనాలతో నివాళులర్పించారు.

" హైదరాబాద్​లో హత్యాచారానికి గురైన యువతి ఆత్మకు శాంతి చేకూరాలని గంగోత్రి సేవా సమితి, ఆగమన్​ సామాజిక సంస్థ ఆధ్వర్యంలో మేమంతా గంగాపూజ, దీపదాన్​, శాంతి పఠనం చేపట్టాం. వాటితో పాటు నిత్య గంగాహారతిని యువతి పేరుపై నిర్వహించాం. "
-డా. సంతోశ్​ ఓజా, వారణాసి

బిహార్​లో జరిగిన అత్యాచార ఘటనలో తీవ్రంగా గాయపడిన యువతి త్వరగా కోలుకోవాలని గంగాహారతిలో భాగంగా.. గంగామాతను వేడుకున్నారు.

ఇదీ చూడండి: 8 ఏళ్ల చిన్నారినీ వదల్లేదు.. కత్తితో బెదిరించి!

Last Updated : Dec 1, 2019, 12:16 PM IST

ABOUT THE AUTHOR

...view details