సమాజంలో స్త్రీలకు రక్షణ కరవైంది. కాపాడాల్సిన పోలీసే మహిళపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్ షహజాన్పుర్లో జరిగింది.
ఏం జరిగింది..?
తనను కొందరు సామూహిక అత్యాచారం చేశారని ఫిర్యాదు చేయడానికి ఓ మహిళ షహజాన్పుర్ తాలూకా జలాదాబాద్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది. అయితే ఫిర్యాదు తీసుకోవాల్సిన ఎస్ఐ.. విచారణ పేరుతో గదిలోకి పిలిచి ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ మేరకు భాదితురాలు వెల్లడించింది. నవంబర్ 30న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని బాధితురాలు వాపోయింది. దీంతో ఏడీజీ అవినాశ్ చంద్రను కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. ఈ ఘటనపై సత్వర దర్యాప్తుకు ఏడీజీ ఆదేశించారు.
అయితే సదరు మహిళ ఇప్పటికే రెండు డజన్లకు పైగా ఫిర్యాదులు ఇచ్చిందని.. వాటిపై విచారణ జరుగుతోందని అధికారులు వెల్లడించారు. ఆమె పోలీసులపై నిరాధార ఆరోపణలు చేస్తోందన్నారు.
మరోవైపు ఈ ఆరోపణలను షహజాన్‌పూర్ ఎస్పీ ఎస్.ఏ ఆనంద్ ఖండించారు.
ఇదీ చదవండి:వైరల్: బాత్రూంలో కట్టలకొద్దీ డబ్బు పారేసి...