ఉత్తర్ప్రదేశ్ దేహత్ జిల్లాలో దారుణం జరిగింది. మరో దళిత యువతి సామూహిక అత్యాచారానికి గురైంది. వారం క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సర్పంచ్ సహా..
ఉత్తర్ప్రదేశ్ దేహత్ జిల్లాలో దారుణం జరిగింది. మరో దళిత యువతి సామూహిక అత్యాచారానికి గురైంది. వారం క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సర్పంచ్ సహా..
22 ఏళ్ల యువతి ఇంట్లో ఒంటరిగా ఉండగా ఇద్దరు వ్యక్తులు చొరబడ్డారు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం ఎవరికైనా చెబితే భయంకరమైన పరిణామాలు ఎదురవుతాయని ఆమెను బెదిరించారు. బాధితురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ అత్యాచార విషయం బహిర్గతమైంది. నిందితుల్లో మాజీ సర్పంచ్ కూడా ఉన్నారని వారు పేర్కొన్నారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం సహా సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు ఎస్పీ కేశవ్ కమార్ చౌదరి తెలిపారు.
ఇదీ చూడండి:తాగుబోతు వీరంగానికి ఒకరు బలి