తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గాంధీ 150: ఆధునిక వైద్యంపై బాపూ ఆలోచనలు

మహాత్ముడు అంటే ఓ సంపూర్ణ మనిషి. బాపూ తన జీవితకాలంలో ఎన్నో విషయాలపై చర్చలు జరిపారు. వాటిలో ఒకటి ఆధునిక వైద్యం. అధునాతన వైద్యాన్ని రాజకీయాలతో ముడిపెట్టేవారు గాంధీ.

గాంధీ 150: ఆధునిక వైద్యంపై బాపూ ఆలోచనలు

By

Published : Sep 28, 2019, 5:23 PM IST

Updated : Oct 2, 2019, 9:04 AM IST

రాజకీయాల్లో మహాత్మా గాంధీ ఆలోచనలపై ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతాయి. కానీ ఆధునిక వైద్యం, మానవుని ఆరోగ్యంపై బాపూ పరిజ్ఞానం నేటికీ ఎంతో ఉపయోగపడుతోంది.

గాంధీ.. తన ఆత్మకథ(మై ఎక్స్​పరిమెంట్స్​ విత్​ ట్రూత్​)లో ఈ విధంగా రాసుకొచ్చారు.

"ఈ విషయం నా 16 ఏళ్ల వయసులో జరిగింది. మా నాన్న ఫిస్టులా వ్యాధితో తీవ్రంగా సతమతమవుతూ మంచానికే పరిమితమయ్యారు. నాన్నను నేను, అమ్మ... దగ్గరుండి చూసుకున్నాం. నేను మా నాన్న కోసం నర్సు బాధ్యతలు చేపట్టాను. ప్రతి రోజు రాత్రి మా నాన్న కాళ్లు నొక్కాను. ఆయన పడుకున్నాకే నేను అక్కడి నుంచి వెళ్లేవాడిని. ఇలా మా నాన్నకు సేవ చేయడం నాకు ఎంతో ఇష్టం."
--- గాంధీ, ఆత్మకథ.

గాంధీ.. భార్య మొదటి ప్రసవం ఆయన ఇంట్లోనే జరిగింది. దీనిని బట్టి బాపూ మంచి నర్సు అని అర్థమవుతోంది. గాంధీ నర్సింగ్​ కూడా నేర్చుకోవడం విశేషం.

"ఓ చిన్న ఆసుపత్రిలో సేవ అందించగలిగే సమయం దొరికింది. రోగుల కష్టాలు దగ్గరుండి తెలుసుకున్నా. వైద్యుడికి ఆ వివరాలు అందించా. ఆయన ఇచ్చిన మందుల చీటిని రోగులకు ఇచ్చేవాడిని. ఈ విధంగా బాధతో సతమతమవుతున్న భారతీయులతో అనుబంధం ఏర్పడింది. వీరిలోని చాలామంది తమిళ, తెలుగు, ఉత్తర భారతానికి చెందిన పురుషులే. అనంతరం ఈ అనుభవంతోనే గాయపడ్డ సైనికులకు నర్సింగ్​ చేశా. నా ఇద్దరు కుమారులు దక్షిణాఫ్రికాలో జన్మించారు. వారి పెంపకంపై తలెత్తిన ప్రశ్నలకు జవాబివ్వడానికి.. అసుపత్రిలో నేను చేసిన సేవ ఉపయోగపడింది."
-- మహాత్మా గాంధీ.

ఆ తర్వాత గాంధీ రచనల్లో ఈ 'ఇంటి చిట్కాలు' చోటు సంపాదించుకున్నాయి. రోగ నివారణలో ఆయుర్వేదం, సంప్రదాయ చికిత్సలు విఫలమైతేనే.. అధునాతన వైద్యాన్ని ఆశ్రయించాలని గాంధీ తండ్రి ఎప్పుడూ చెప్పేవారు. దీనిని మహాత్ముడు వ్యతిరేకించారు. 'ఆపరేషన్​ కోసం వైద్యుడిని సంప్రదిస్తే.. గాయం తొందరగా మానుతుంది. కానీ దేవుడు మరో విధంగా జరగాలనుకున్నాడు' అని గాంధీ అనుకున్నారు.

ఈ ఘటనల ప్రభావం మహాత్ముడిపై బలంగా పడింది. శరీరం, ఆరోగ్యం, వైద్యంపై ఆయనకున్న అవగాహనను మార్చాయి. మనిషి జీవితంలో పరిశుభ్రతకున్న విలువ, సంప్రదాయ చికిత్సా పద్ధతితో అధునాతన వైద్యానికి ఉన్న వ్యత్యాసం వంటి అంశాలు గాంధీని ఎంతో ప్రభావితం చేశాయి.

"పరిశుభ్రత ఎంతో అవసరం. పరిశుభ్రతను దృష్టిలో పెట్టుకొని స్నానం సహా అనేక కార్యాలు మంచంపైనే చేయవచ్చని పాశ్చాత్య వైద్యశాస్త్రం నేర్పించింది. ఈ విధానాలు రోగికి అసౌకర్యం కలిగించవు. వైష్ణవిజంలో ఇలాంటి స్వచ్ఛత అంశాలు నిత్యం ఉంటాయి."
--- గాంధీ.

గాంధీ తన ఆత్మకథలో రాసుకున్న ఈ వాఖ్యాలు "మై ఫాదర్స్​​ డెత్ అండ్​ మై డబుల్​ షేమ్​​" అనే అధ్యాయంలోనిది. ఇలాంటి ఆసక్తికరమైన శీర్షిక ఎందుకు పెట్టారు. గాంధీ మాటల్లోనే ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం.

"నా భార్య తొలి సంతానాన్ని ఆశిస్తున్న రోజులవి. ఆ పరిస్థితులను ఇప్పుడు గుర్తుతెచ్చుకుంటే నాకు సిగ్గుగా ఉంది. నా కోరికలను అణచివేయలేకపోయాను. అప్పటికీ నేను విద్యార్థి దశలోనే ఉన్నా. ఈ కోరికల వల్ల తల్లిదండ్రులపై నాకున్న ధర్మం విస్మరించా. వీటి వల్ల నాకు ఎంతో సిగ్గుగా ఉండేది. ప్రతి రోజు నా చేతులు మా నాన్న గారి కాళ్లను నొక్కుతుంటే... నా మనసు అంతా పడకగదివైపే తిరిగేది. మతం, వైద్యం వంటి అంశాలు మోహాన్ని వ్యతిరేకించిన రోజుల్లో నాకు ఈ కోరికలు కలిగాయి."
--- గాంధీ.

ఈ ఘటనల ప్రభావం బ్రహ్మచర్యం, భార్య-భర్త సంబంధాల గురించి గాంధీకున్న భావనలపై పడింది.

వైద్యం, ప్రజా ఆరోగ్యం గురించి గాంధీకున్న భావనలపై సంయమనం, స్వీయ కరుణ, అహింసా అంశాలు ప్రభావం చూపాయి. 1888లో బారిస్టర్​ పట్టా కోసం లండన్​కు వెళ్లినప్పటికీ.. శరీరం, శాఖాహారంపైనే ఆయన ఆలోచనలు ఉండేవి.

రస్కిన్​ సిద్ధాతం(అన్​టూ ది లాస్ట్​), జెరెమి బెంథమ్​ యుటిలిటేరియనిజం, రాబర్ట్​ ఓవన్​ ఉతోపైనిజమ్​ వంటి రచనల నుంచి గాంధీ ఆలోచనలు ఉద్భవించాయి.
బాపూ జీవితంపై రెండు పుస్తకాలు ఎంతో ప్రభావం చూపాయి. అవి లూయిస్​ కుహ్నే రాసిన ది న్యూ సైన్స్​ ఆఫ్​ హీలింగ్​ ఆర్​ ది డాక్ట్రిన్​​ ఆఫ్​ ఒన్​నెస్​ ఆఫ్​ ఆల్​ డిసీసెస్​, నియో- నాట్యురోపతి: ది న్యూ సైన్స్​ ఆఫ్​ హీలింగ్​ ఆర్​ ది డాక్ట్రిన్​​ ఆఫ్​ యూనిటి ఆఫ్​ డిసీసెస్​, అడాల్ఫ్​ జస్ట్​కు చెందిన రిటర్న్​ టు నేచర్​! పారడైజ్​ రీగైండ్​.

ఇవి చదివిన అనంతరం హైడ్రోథెరపి(నీటితో చికిత్స), పైటోథెరపి(చెట్లతో చికిత్స), మడ్​ పౌల్​టైస్​(మట్టితో చికిత్స), స్వీయ నియంత్రణ, ఆరోగ్య పద్ధతులు, జీవన విధానంలో స్థిరత్వం కోసం గాంధీ పట్టుబట్టారు.

ప్రజా ఆరోగ్యంపై గాంధీ ఆలోచనలు సమాజంలో ఆధునిక వైద్యానికున్న వ్యతిరేక స్థానం ఆధారంగా వచ్చాయి. ఇవన్నీ స్వీయ నియంత్రణ, ఇంటి నివారణలపైనే ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి.

ఒకానొక సందర్భంలో నేను వైద్య వృత్తికి ఎంతో ఆక్షర్షితుడినయ్యాను. దేశం కోసం డాక్టర్​ అవ్వాలనుకున్నా. వైద్యులు సమాజంలో ఉన్నతస్థాయికి ఎందుకు చేరుకోలేకపోయారో నాకు ఇప్పుడు అర్థమవుతోంది. మన నాడి పట్టుకోవడానికి బ్రిటీషర్లు అధునాతన వైద్యాన్ని ఉపయోగించారు. రాజకీయ లాభం కోసం ఇంగ్లీష్​ వైద్యులు అనేక ఆసియా దేశాల సర్వాధికారులతో ఈ వృత్తిని ఉపయోగించారు' అని గాంధీ తన హింద్​ స్వరాజ్​లో రాసుకున్నారు.

"వైద్యులు మనల్ని మానసికంగా అస్థిరం చేశారు. మన శరీరాన్ని బాగా చూసుకోవడమే వైద్యుని పని. అసలు రోగాలు ఎలా వస్తాయి? మన నిర్లక్షం వల్లే. నేను ఎక్కువ తింటా. అజీర్ణం చేస్తుంది. వైద్యుని వద్దకు వెళ్తా. ఆయన మందులిస్తారు. నా రోగం పోతుంది. మళ్లీ నేను ఎక్కువ తింటా. మళ్లీ ఆయనిచ్చిన మందులు వేసుకుంటా. తొలిసారే ఆయనిచ్చిన మందులు వేసుకోకపోతే.. నాకు పడాల్సిన శిక్ష అనుభవించేవాడిని. ఇకపై అధికంగా తీనేవాడిని కాదు. వైద్యుడు అడ్డుపడి నాకు సహాయం చేశాడు. దీని వల్ల నా మనసు శాంతించినా.. మెదడు బలహీనపడింది. పదేపదే మందులు వేసుకోవడం వల్ల మెదడు నియంత్రణ కోల్పోయింది. అందరికంటే ఐరోపా వైద్యులు ఎంతో చెడ్డవారు. శరీరాన్ని సరిగ్గా చూసుకోకపోవడం వల్ల అనేక జంతువులను చంపుతున్నారు. ఔషధాలను పరీక్షించడానికి జంతువులపై వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీనిని ఏ మతం అంగీకరించదు. మన శరీరం కోసం అన్ని ప్రాణాలు తీయడం సరికాదు."
--- గాంధీ.

మశూచి(స్మాల్​ పాక్స్​) పుట్టుకపై మహాత్ముడి ఆలోచనలు- అధునాతన వైద్యం మధ్య ఉన్న వ్యత్యాసం మరొక ఆసక్తికర అంశం. 1960 వరకు మశూచి పెద్ద రోగం. దానిని అంతం చేయడానికి 1796లో టీకాను రూపొందించారు. 19వ శతాబ్దంలో దానిని విస్త్రతంగా ఉపయోగించేవారు. దీనికి విరుద్ధంగా.. పాపం, దుష్ప్రవర్తన వల్లే ఈ రోగం సోకేదని విస్త్రతంగా ప్రచారం జరిగేది.

ఈ రోగంపై ప్రముఖ, వైద్య వ్యతిరేక గళాన్ని వినిపించేవారు గాంధీ.

"మశూచికి మనం ఎంతో భయపడతాం. దీనిపై ఎంతో ఆందోళన చెందుతాం. కానీ ఇది కూడా ఇతర రోగాల్లానే ఉంటుంది. పేగులలో కొంత రుగ్మత కారణంగా రక్తం అశుద్ధమవుతుంది. దీని వల్ల శరీరానికి సోకిన విషం మశూచిలా బయటకు వస్తుంది. ఇదే నిజమైతే మశూచికి భయపడాల్సిన అవసరం లేదు. ఇది నిజంగా అంటు వ్యాధే అయితే రోగిని ముట్టుకున్న వెంటనే మనకూ సోకాలి. కానీ ఇది ప్రతిసారీ జరగదు. అందువల్ల రోగిని ముట్టుకోవడంలో హాని లేదు. కానీ ఇలా చేసేముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. టీకాలు వేయడం క్రూరమైన ఆచారం. ఇది మన కాలంలోని ఒక విషపూరిత మూఢనమ్మకం. టీకా వేయడం నీచమైన ప్రక్రియ."
--- గాంధీ.

శరీర నిర్మాణ, శారీరక లేదా జీవరసాయన మార్పుల నుంచి వ్యాధి-కారణాలపై ఏదైనా వ్యాధి యొక్క దైవిక కారణాల ప్రశ్న ఇక్కడ అధిగమిస్తుంది. 'ఈ అమానవీయ పద్ధతిని రద్దు చేసే మార్గంలో నిలబడటం వైద్యుల స్వలాభం మాత్రమే, పెద్ద ఆదాయాన్ని కోల్పోతారనే భయపడుతున్నారు' అని గాంధీ ఆరోపించారు.

జంతువులను చంపడం, ఔషధాలపై ఎక్కువగా ఆధారపడటం, ఔషధాల్లో పేటెంట్​ హక్కులని ప్రచారం చేయడం, ఆసుపత్రుల సంఖ్య పెరగడం వల్ల ఆధునిక వైద్యాన్ని గాంధీ వ్యతిరేకించారు.

వీటికి ప్రత్యామ్నాయంగా పారిశుద్ధ్యం, పరిశుభ్రతతో కలిగే లాభాలను నొక్కి చెప్పారు.

వైద్యం అనేది సామాజిక శాస్త్రమని జర్మనీ రోగ నిర్ధారకుడు రుడాల్ఫ్​ విర్కోవ్​ అనేవారు. వైద్యాన్ని రాజకీయాలతో ముడిపెట్టారు రుడాల్ఫ్​. గాంధీ కూడా ఇంతే. ప్రకృతి నివారణ, వ్యక్తిగత పరిశుభ్రత, మతపరమైన కట్టుబడి గురించి ఆయన భావన ఆధునిక ప్రజారోగ్యాన్ని ఎప్పటికీ సాధించలేని స్థితికి చేర్చింది.

(రచయిత: డా. జయంత భట్టాచార్య)

Last Updated : Oct 2, 2019, 9:04 AM IST

ABOUT THE AUTHOR

...view details