తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గాంధీ150: నేటి తరానికి బాపూ విద్యావిధానం అవసరం - గాంధీ150

ప్రస్తుతం దేశంలో విద్యావిధానం ఏమేర ఉందో అందరికి తెలిసిందే. విద్యార్థులు మంచి మార్కులు సాధించినా.. సరైన ఉద్యోగం పొందలేకపోతున్నారు. ఈ తరానికి గాంధేయవాద సంపూర్ణ విద్య అవసరం. విద్యావిధానంపై గాంధీ ఆలోచనలు భిన్నంగా ఉండేవి. సాంకేతిక పరిజ్ఞానంపై ఆనాడే  అంచనా వేయగలిగారు బాపూ. విద్య అనేది సాంకేతిక విషయాన్ని అందిస్తూనే నైపుణ్యాలను పెంచాలని భావించేవారు.

గాంధీ150: నేటి తరానికి గాంధేయవాద సంపూర్ణ విద్య అవసరం

By

Published : Sep 13, 2019, 7:00 AM IST

Updated : Sep 30, 2019, 10:16 AM IST

మానవాళికి జ్ఞానోదయం కలిగించే సాధనం విద్య. పురాతన కాలంనాటి అజ్ఞానాన్ని తొలగించి ఆధునిక సమాజాన్ని సృష్టించేందుకు వీలు కల్పిస్తుంది. చెట్ల వేళ్ల మాదిరి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన విద్యకు ఆయా ప్రాంతీయ మూలాలు ఉంటాయి. కానీ ప్రస్తుత విద్యావిధానం ఉద్యోగాలను సృష్టించలేకపోతోంది. నేర్చుకునే విధానంలో లోపాలు, విషయంలో నాణ్యత లేమి వైఫల్యాలుగా నిలుస్తున్నాయి.

విద్యావిధానంపై గాంధీ ఆలోచనలు భిన్నంగా ఉండేవి. సాంకేతిక పరిజ్ఞానంపై ఆనాడే సరిగ్గా అంచనా వేయగలిగారు గాంధీ. విద్య అనేది సాంకేతిక విషయాన్ని అందిస్తూనే నైపుణ్యాలను పెంచాలని భావించేవారు. "విద్య అనేది చిన్నారుల్లోని ప్రతిభను.. శరీరం నుంచి మనిషిని.. ఆత్మలో దాగిన మనస్సును వెలికితీసేది" అని బాపూ ఎప్పుడూ చెప్తూ ఉండేవారు.

పట్టుదల, సహనం నిజమైన కిరణాలు..

ప్రస్తుత రోజుల్లో విద్యార్థులు ప్రతి సబ్జెక్టులో మంచి మార్కులు సాధిస్తున్నారు కానీ.. సరైన ఉద్యోగం సాధించలేకపోతున్నారు. విద్య అనేది ఉద్యోగులను కాకుండా వ్యవస్థాపకులను అభివృద్ధి చేయాలని గాంధీజీ నొక్కిచెప్పారు. పట్టుదల, సహనం అనే గాంధేయ పద్ధతులు విజయానికి నిజమైన కిరణాలు. తగినంత శ్రమ లేకుండానే శీఘ్ర ఫలితాల కోసం ఆశించే విద్యార్థులు.. నిలకడగా రాణించేందుకు గాంధీని చక్కటి ఉదాహరణగా తీసుకోవాలి.

మూలస్తంభాలు...

విద్య అనేది జీవితకాల ప్రక్రియ అని గాంధీ నమ్మేవారు. ప్రతి ఒక్కరి జీవిత ప్రయాణంలో విద్యను గౌరవించాలని, పునరాలోచనతో ప్రతిబించాలని భావించేవారు బాపూజీ. ప్రశ్నించే తత్వం, తెలుసుకోవాలనే ఉత్సకత.. జ్ఞానం పొందేందుకు నిజమైన మూలస్తంభాలని ఆయన నమ్మారు. " నిరంతరం ప్రశ్నించే తత్వం, ఆరోగ్యకరమైన పరిశోధనాత్మకత అనేది ఏ రకమైన అభ్యాసాన్నైనా సాధించేందుకు అవసరం" అన్న గాంధీ మాటలు.. విద్య అవసరాన్ని నొక్కి చెబుతాయి.

అక్షరాస్యత ద్వారా భారతదేశానికి విముక్తి కల్పించాలని గాంధీజీ కృషి చేశారు. జ్ఞాన సముపార్జనకు వాక్చాతుర్యాన్ని పెంపొందించే ఒత్తిడి లేని వాతావరణ కల్పనపై దృష్టి పెట్టారు. విద్యను నాలుగు గోడలకు పరిమితం చేయకూడదని అభిప్రాయపడ్డారు. ఎల్లప్పుడూ ఆచరణాత్మక అభ్యాసానికి ప్రయత్నించారు. మన ఇంద్రియాలన్నీ సమానంగా సమాచారం స్వీకరించేలా పూర్తిస్థాయి అభ్యాసం కోసం ఆయన సూచించారు. నైతిక అభ్యాసం అనే ఆయన భావనే ప్రస్తుతం మన పాఠశాలలు, కళాశాలల్లో సత్యం, అహింసగా అమలవుతోంది.

భావోద్వేగ అభ్యాసం అవసరం...

క్రమశిక్షణ ఆధారిత విద్యాభ్యాసాన్ని ప్రచారం చేశారు బాపూజీ. అది అనుచరులను కాకుండా సమర్థ నాయకులను తయారు చేసేందుకు ప్రయత్నిస్తుందని భావించారు. విద్య మన భావోద్వేగాలను ఆకర్షించాలని ఆయన నమ్మారు. తద్వారా భావోద్వేగ​ అభ్యాస భావనను ప్రతిపాదించారు. అది ఈక్యూ (ఎమోషనల్​ కోషెంట్​)ను మెరుగుపరుస్తుంది కాని ఐక్యూ (ఇంటెలిజెన్స్​ కోషెంట్​)ని కాదు. " నయీ-తలీమ్​ పని కేవలం వృత్తిని నేర్పించడమే కాదు, దాని ద్వారా మొత్తం మనిషిని అభివృద్ధి చేయడం" అనే గాంధీజీ ప్రకటన భావోద్వేగ విద్యను వ్యాప్తి చేయడమే లక్ష్యంగా ఉంది.

- డా.​ చల్లా క్రిష్ణవీర్​ అభిషేక్​ , సాఫ్ట్​స్కిల్స్​ ట్రైనర్​, ఫ్యాకల్టీ, ఆంధ్ర విశ్వవిద్యాలయం

Last Updated : Sep 30, 2019, 10:16 AM IST

ABOUT THE AUTHOR

...view details