ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఆంగ్ల నిఘంటువులో కొత్తగా 'మోదీ లై' అనే పదం చేరిందని ఎద్దేవా చేశారు. ఈ పదానికి అర్థం తెలుపుతూ ఉండే ఒక ఫొటోను ట్వీట్టర్ ఖాతాలో పంచుకున్నారు రాహుల్. మార్ఫ్ చేసిన ఈ ఫొటోలో మోదీ లైకు 'నిత్యం అబద్ధాలు చెప్పడం' వంటి అర్థాలున్నాయి.
మన్మోహన్ సలహా తీసుకోవాల్సింది..
పంజాబ్లోని ఫరిద్కోట్ జిల్లా బర్గారి నగరంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్... మోదీ హయాంలో ఆర్థిక వ్యవస్థ ధ్వంసమైందని ఆరోపించారు. మన్మోహన్ సింగ్, నరేంద్ర మోదీ పాలనల మధ్య ఎంతో వ్యత్యాసముందని అభిప్రాయపడ్డారు.