పౌరసత్వ చట్టంపై ప్రజలను విపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జే.పి. నడ్డా ఆరోపించారు. పొరుగుదేశంలో హింసకు గురైన మైనార్టీలకు సాయం చేయాలన్న ఆలోచనకు.. మహాత్మా గాంధీ, నెహ్రూ, మన్మోహన్ సింగ్ మద్దతు ఇచ్చారని ఆయన ప్రస్తావించారు. పౌరసత్వ చట్టం వల్ల కోట్లమంది శరణార్థులు భారత్‌లోకి ప్రవేశిస్తారని కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని నడ్డా మండిపడ్డారు.
'ఈ ఆలోచనకు గాంధీ, నెహ్రూ, మన్మోహన్ మద్దతిచ్చారు'
పౌరసత్వ చట్టంపై విపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. చట్టం వల్ల కోట్ల మంది శరణార్థులు భారత్‌లోకి ప్రవేశిస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. పాకిస్థాన్ నుంచి శరణార్థులుగా వచ్చిన బృందంతో భాజపా ప్రధాన కార్యాలయంలో నడ్డా మాట్లాడారు.
'మైనార్టీలకు సాయం చేయాలన్న ఆలోచనకు గాంధీ నెహ్రూ మద్దతిచ్చారు'
పాకిస్థాన్ నుంచి శరణార్థులుగా వచ్చిన మైనారిటీ బృందంతో భాజపా ప్రధాన కార్యాలయంలో మాట్లాడారు నడ్డా. పౌరసత్వ చట్టం ఎవరి పౌరసత్వాన్ని తీసుకోదని.. ఇస్తుందని పునరుద్ఘాటించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే విపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు.
ఇదీ చదవండి: ఆర్ఎస్ఎస్కు రాజకీయాలతో సంబంధం లేదు: భగవత్