తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గాంధీ 150: వైవిధ్యాలున్నా జాతిహితమే అంతిమ లక్ష్యం

20వ దశాబ్దంలో దేశానికి రెండు కళ్లలా వెలిగిన రవీంద్రనాథ్​ ఠాగూర్​, మహాత్మాగాంధీలకు ప్రజల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఒకరు రచనలతో, మరొకరు ఉద్యమాలతో ప్రజలను మేల్కొలిపారు. ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలున్నా దేశప్రయోజనాలే వారి అంతిమ లక్ష్యం.

గాంధీ 150: వైవిధ్యాలున్నా జాతిహితమే అంతిమ లక్ష్యం

By

Published : Sep 15, 2019, 7:01 AM IST

Updated : Sep 30, 2019, 3:55 PM IST

విశ్వకవి రవీంద్రనాథ్​ ఠాగూర్​, జాతిపిత మహాత్మాగాంధీ... 20వ శతాబ్దపు దిగ్గజాలు. ఎంతో మందిని ప్రభావితం చేసిన మార్గనిర్దేశకులు. సంపూర్ణ స్వరాజం నుంచి స్వాతంత్య్ర సమర పురోగతి వరకు అనేక అంశాలపై విభిన్న అభిప్రాయాలను వెలిబుచ్చారు. దారులు వేరైనా వారి లక్ష్యం, సిద్ధాంతాలు ఒకటే.

సమస్యల పరిష్కారం లేదా అర్థం చేసుకోవడంలో గాంధీ ఆలోచనలను ఠాగూర్​ చాలాసార్లు సవాలు చేశారు. సమీకరణ, నైతిక సిద్ధాంత వ్యూహాలపై పరస్పరం తీవ్రంగా విభేదించారు. వాళ్ల అభిప్రాయభేదాలన్నీ సైద్ధాంతిక, తాత్విక ఆలోచనలతో ముడిపడి ఉంటాయి.

కానీ.. ఇద్దరూ భారత నాగరికత గ్రామాల్లోనే నిక్షిప్తమై ఉందని భావించారు. నిజమైన స్వయం సమృద్ధి సాధిస్తేనే వలస పాలన నుంచి విముక్తి లభించినట్లని అభిప్రాయపడ్డారు. దేశంలోని గ్రామీణులు ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ శక్తిమంతం కావాలని ఆకాంక్షించారు.

స్వరాజ్య సిద్ధితోనే స్వేచ్ఛాయుత భారత్​ ఏర్పడుతుందని గాంధీ నమ్మారు. అందుకు సహాయ నిరాకరణోద్యమంలో యువతను భాగం కావాలని పిలుపునిచ్చారు. ఠాగూర్​ మాత్రం స్వదేశీ సమాజంతోనే స్వతంత్ర భారతం నిర్మితమవుతుందని, రాజకీయ సుస్థిరత ఏర్పడుతుందన్నారు. బలిపీఠం ఎదుట యువ జీవితాలను త్యాగం చేయటం బాధ్యతారాహిత్యం అన్నారు. ఈ చర్య దీర్ఘకాలంలో సరైన ఫలితాలను ఇవ్వవని వాదించారు.

విదేశీ ఆర్థిక దోపిడి వ్యతిరేకంగా దేశీయ ఉత్పత్తులను కాపాడుకోవాలని గాంధీ భావించారు. అందుకు చరఖా ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ విషయంలో ఠాగూర్​ పరిమితంగా ఉండేవారు. విశ్వవ్యాప్తమైన సాంకేతికతను వాడటంలో ఎలాంటి తప్పు లేదని భావించేవారు. ఆరోగ్యకరమైన స్వయం సమృద్ధ పురోగతితో ఎలాంటి ప్రమాదం ఉండదని అనేవారు.

మరోసారి.. 1934లో బిహార్​లో సంభవించిన భయంకర భూకంపం.. అక్కడ జరిగిన అంటరానితనానికి సంబంధించిన దురాగతాలపై దైవిక మందలింపుగా గాంధీ ప్రకటన చేశారు. ఈ వ్యాఖ్యలపై మూఢనమ్మకాలు పెరుగుతాయని ఠాగూర్​ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రకమైన ప్రకటనలు భారతీయ సమాజంపై దీర్ఘకాలిక దుష్ప్రభావం ఉంటుందన్నారు. కానీ గాంధీ తన మాటపైనే నిలబడ్డారు. మనిషి చేసే తప్పులకు ఏదోరకంగా శిక్ష అనుభవిస్తారని అన్నారు.

యంగ్​ ఇండియా, మోడరన్​ రివ్యూల్లో ప్రచురితమైన బహిరంగ లేఖలు, వ్యక్తిగత సందేశాలు.. దేశంపై వీరిద్దరికీ ఉన్న అంకితభావాన్ని బహిర్గతం చేస్తాయి. పౌరసమాజంపై పరస్పర ఆరోగ్యకరమైన చర్చలు జాతీయ ప్రయోజనానికి ఉద్దేశించినవే.

ఇన్ని విభేదాలున్నా గాంధీ, ఠాగూర్ పరస్పరం గౌరవించుకునేవారని 1915 సంఘటన చూస్తేనే అర్థమవుతుంది. ఆ సంవత్సరమే గాంధీని మహాత్మ అని సంభోదించారు ఠాగూర్. ఆయన తన స్నేహితుడు సి.ఎఫ్​.ఆండ్రూస్​కు రాసిన లేఖలో గాంధీ నారాయణుడనీ, సత్యాగ్రహంలో దేశం భాగస్వామ్యం అయిందన్నారు. న్యాయం, ధర్మం కోసం సొంతంగా యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు నారాయణ సైన్యాన్ని నమ్ముకోవటం ఉత్తమమని అన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఠాగూర్‌ను 'రక్షకుడు' అని గాంధీ సంభోదించారు.

1919లో జరిగిన జలియన్​ వాలాబాగ్​ మారణకాండ తర్వాత నిరసనగా బ్రిటన్​ ఇచ్చిన 'సర్​' బిరుదును త్యజించారు ఠాగూర్. గాంధీ కూడా ఆయనకు ఇచ్చిన గౌరవ ప్రదమైన మెడళ్లు, పురస్కారాలను ప్రభుత్వానికి ఇచ్చేశారు. మారణకాండకు స్మారకాన్ని నిర్మించేందుకు దేశవ్యాప్తంగా విరాళాలు సేకరించారు.

కొద్దిగా వెనక్కి వెళితే 1914-15 సమయంలో.. దక్షిణాఫ్రికా డర్బన్​లోని మోహన్​దాస్​ కరమ్​చంద్​ గాంధీ పాఠశాల విద్యార్థులకు నాలుగు నెలల పాటు ఠాగూర్​ స్థాపించిన శాంతినికేతన్​ ఆతిథ్యం ఇచ్చింది. స్వాతంత్య్రోద్యమంలో భాగంగా వీరిద్దరీ మధ్య చిగురించిన స్నేహం 3 దశాబ్దాల పాటు కొనసాగింది.

1920లో సబర్మతి ఆశ్రమాన్ని ఠాగూర్​ సందర్శించారు. అందుకు ప్రతిగా 1925లో శాంతినికేతన్​ను మొదటిసారి దర్శించారు గాంధీ. మరోసారి 1940లో వెళ్లారు. ఉపవాస దీక్షలు, జైలు జీవితంతో ఉద్యమాన్ని సాగిస్తున్న గాంధీకి నైతిక మద్దతు ప్రకటించారు ఠాగూర్​. మరోవైపు విశ్వభారతి కోసం రూ.60 వేలను సమీకరించి ఠాగూర్​కు ఇచ్చారు గాంధీ.

ఆసక్తికరంగా 1930లో.. ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్​స్టీన్​ భూమి అస్తిత్వ ప్రకటనపై గాంధీ వాదనతో ఏకీభవించారు.

రెండు విభిన్న భావజాలాల మధ్య ఈ పరస్పర స్నేహభావం ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచింది. ప్రపంచ దేశాల్లో ప్రత్యేకంగా భారత్​ నిలవటంలో వీరిద్దరి పాత్ర ఎంతో ఉంది. వారిద్దరి చర్చలు, అంశాలపై విభేదాలు కేవలం జాతి హితం కోసమే.

(రచయిత- అనన్యా దత్తా గుప్తా, అసోసియేట్ ప్రొఫెసర్, విశ్వభారతి విశ్వవిద్యాలయం, బోల్​పుర్​, బంగాల్​)

ఇదీ చూడండి: చంద్రయాన్​ కోసం కృష్ణుడికి 56 వంటకాలతో నైవేద్యం

Last Updated : Sep 30, 2019, 3:55 PM IST

ABOUT THE AUTHOR

...view details