తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ప్రపంచ రికార్డు' సౌరదీపాలతో గాంధీకి నివాళులు - ఇందిరాగాంధీ ఇండోర్​ స్టేడియం

మహాత్మాగాంధీ 150 జయంతిని దిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్​ స్టేడియంలో కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దిల్లీ ఎన్​సీఆర్​ ప్రాంతానికి చెందిన సుమారు 5వేల మంది విద్యార్థులు హాజరై రెండు గిన్నిస్​ రికార్డులు నెలకొల్పారు.

'ప్రపంచ రికార్డు' సౌరదీపాలతో గాంధీకి నివాళులు

By

Published : Oct 3, 2019, 5:06 AM IST

Updated : Oct 3, 2019, 7:35 AM IST

మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా బుధవారం దిల్లీలో రెండు గిన్నిస్​ రికార్డులు నమోదయ్యాయి. దిల్లీ-ఎన్​సీఆర్​ ప్రాంతానికి చెందిన విద్యార్థులు భారీ సంఖ్యలో ఒకేచోట చేరి.. పర్యావరణ మనుగడ గురించి పాఠాలు చెప్పడం ఇందులో ఒక రికార్డు. ఈ కార్యక్రమానికి సుమారు 5వేల మంది విద్యార్థులు హాజరయ్యారు.

అనంతరం ఆ విద్యార్థులంతా ఒకేసారి సౌర విద్యుత్తు దీపాలు వెలిగించి రెండో రికార్డు నెలకొల్పారు.

మహాత్ముడికి నివాళిగా కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ దిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్​ స్టేడియంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది.

ఏడు చెట్లను పెంచండి..

కార్యక్రమానికి హాజరైన పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్​ జావడేకర్​ విద్యార్థులను అభినందించారు. వారి చేతులతోనే కాదు హృదయాలతో సౌర దీపాలను తయారు చేశారని కొనియాడారు. ప్రతి ఒక్కరు తమ జీవిత కాలంలో కనీసం ఏడు చెట్లను పెంచటం ద్వారా సొంతంగా ప్రాణవాయువు నిధి (స్వీయ ఆక్సిజన్​ నిధి) ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రకృతి పట్ల హింసాత్మకంగా వ్యవహరించబోమని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.

ఇదీ చూడండి: గాంధీ 150: ఈటీవీ భారత్​ కృషికి సర్వత్రా అభినందనల వెల్లువ

Last Updated : Oct 3, 2019, 7:35 AM IST

ABOUT THE AUTHOR

...view details