తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​కు రఫేల్​- వాయుసేనకు కొత్త శక్తి

భారత వాయుసేనను మరింత బలోపేతం చేస్తూ ఐదు రఫేల్​ యుద్ధ విమానాలు అందుబాటులోకి వచ్చాయి. బుధవారం మధ్యాహ్నం ఈ విమానాలు అంబాలా వైమానిక స్థావరానికి చేరుకున్నాయి.

GAME CHANGER RAFALE REACHES INDIA
'టచ్​డౌన్​' రఫేల్​... నిరీక్షణకు తెర

By

Published : Jul 29, 2020, 5:38 PM IST

భారత వాయుసేనలో నవశకం మొదలైంది. దేశ ప్రజలు ఎంతగానో ఎదురుచూసిన రఫేల్​ యుద్ధ విమానాలు బుధవారం మధ్యాహ్నం 3గంటలకు హరియాణాలోని అంబాలా ఎయిర్​బేస్​కు చేరుకున్నాయి. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో గేమ్​ఛేంజర్​ 'రఫేల్​' వాయుసేనకు అందుబాటులోకి రావడం అత్యంత కీలక విషయం.

నిరంతర పర్యవేక్షణ..

రఫేల్​ రాక కోసం భారత ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా చేసింది. అంబాలా వైమానిక ప్రాంతాన్ని ఉదయం నుంచే నిరంతరం పర్యవేక్షించాయి వైమానిక దళ హెలికాప్టర్లు.

ఇదీ చూడండి:-గేమ్​ ఛేంజర్​ 'రఫేల్'​ ఎందుకింత ప్రత్యేకం?

రఫేల్​ టచ్​డౌన్ నేపథ్యంలో మంగళవారమే అంబాలాలో 144 సెక్షన్​ విధించింది హరియాణా ప్రభుత్వం.

స్వాగతం ఇలా...

ఫ్రాన్స్​ నుంచి సోమవారం బయలుదేరిన ఐదు రఫేల్​ యుద్ధ విమానాలు.. ఆ రోజు సాయంత్రమే మధ్యలో యూఏఈలో దిగాయి. అనంతరం భారత్​కు బయలుదేరాయి.

ఆకాశ వీధిలో

ఇదీ చూడండి:-ఔరా: ఆకాశంలోనే ఇంధనం నింపుకున్న 'రఫేల్'!

టేకాఫ్​ అయిన కొద్దిసేపటికే పశ్చిమ అరేబియా సముద్రంలో ఉన్న ఐఎన్​ఎస్​ కోల్​కతాతో సంప్రదింపులు జరిపాయి యుద్ధ విమానాలు.

అనంతరం బుధవారం మధ్యాహ్నం భారత గగనతలంలోకి ప్రవేశించాయి. రెండు సుఖోయ్​-30ఎమ్​కేఐ విమానాలతో రఫేల్​ జెట్లకు స్వాగతం పలికింది ప్రభుత్వం. గాలిలో పక్షుల్లా విహరిస్తున్న విమానాలకు సంబంధించిన చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

భారత గగనతలంలో...

అంబాలా ఎయిర్​బేస్​లో టాచ్​డౌన్​ అయిన వెంటనే యుద్ధ విమానాలకు వాటర్​ సెల్యూట్​తో ఘన స్వాగతం పలికింది వాయుసేన.

రఫేల్​

'దేశ రక్షణ ఓ పుణ్యం..'

భారత్​ భూభాగాన్ని ముద్దాడిన రఫేల్​కు ప్రధాని నరేంద్రమోదీ స్వాగతం పలికారు. ఈ విషయాన్ని సంస్కృతంలో ట్వీట్ చేశారు. "దేశ రక్షణ ఒక పుణ్యం, ఒక వ్రతం, ఒక యజ్ఞం" అని పేర్కొన్నారు.

మోదీ ట్వీట్​

రఫేల్​ టచ్​డౌన్​పై రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్​ స్పందించారు. దేశానికి పొంచి ఉన్న ముప్పును వైమానిక దళం దీటుగా ఎదుర్కోగలదని... భారత ప్రాదేశిక సమగ్రతను ప్రశ్నించేవారికి రఫేల్ ఓ సమాధానమిస్తుందని చైనాను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

రాజ్​నాథ్​ ట్వీట్​

36 రఫేల్​ యుద్ధ విమానాల కోసం భారత్​- ఫ్రాన్స్​ మధ్య 2016లో ఒప్పందం కుదిరింది. తొలి విడతలో భాగంగా ఐదు జెట్లను భారత్​కు అప్పగించింది ఫ్రాన్స్​. మిగిలినవి వచ్చే ఏడాదికల్లా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నట్టు అధికారవర్గాల సమాచారం.

'టచ్​డౌన్​' రఫేల్​... భారతీయుల నిరీక్షణకు తెర

ఇదీ చూడండి:-హ్యామర్​ క్షిపణితో రఫేల్​కు మరింత శక్తి!

ABOUT THE AUTHOR

...view details