తెలంగాణ

telangana

గౌతమ్​ గంభీర్​కు బెదిరింపు కాల్స్

By

Published : Dec 21, 2019, 3:16 PM IST

Updated : Dec 21, 2019, 4:55 PM IST

ప్రముఖ మాజీ క్రికెటర్​, భాజపా ఎంపీ గౌతమ్​ గంభీర్​.. తనకు బెదిరింపు కాల్స్​ వచ్చినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేపట్టారు. ​

gautam gambheer
గౌతమ్​ గంభీర్​ను చంపేస్తామంటూ బెదరింపు కాల్స్​

తనకు, తన కుటుంబ సభ్యులకు బెదిరింపు కాల్స్​ వస్తున్నాయని.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు భాజపా దిల్లీ ఎంపీ, ప్రముఖ మాజీ క్రికెటర్​ గౌతమ్​ గంభీర్​. రెండ్రోజుల క్రితం 2, 3 సార్లు హతమారుస్తామని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. తనకు, తన కుటుంబానికి భద్రతను ఏర్పాటు చేయాలని కోరాడు గంభీర్​. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

గౌతమ్​ గంభీర్​ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్..!​

"నాకు, నా కుటుంబానికి ఓ అంతర్జాతీయ నంబరు నుంచి కాల్స్​ వచ్చాయి. మమ్మల్ని చంపేస్తామంటూ బెదిరించారు. నాకు, నా కుటుంబానికి భద్రత కల్పించాల్సిందిగా కోరుతున్నా."

-గౌతమ్​ గంభీర్​, భాజపా ఎంపీ, మాజీ క్రికెటర్​.

ఇదీ చూడండి : 'హింసను సృష్టించకండి.. ఎవ్వరినీ వదలం'

Last Updated : Dec 21, 2019, 4:55 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details