తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీ లోక్​సభ అభ్యర్థుల ఆదాయంలో గంభీర్​ టాప్​ - దిల్లీ

భారత మాజీ క్రికెటర్​ గౌతం గంభీర్​.. దిల్లీలోని లోక్​సభ అభ్యర్థుల్లో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. తూర్పు దిల్లీ భాజపా అభ్యర్థిగా మంగళవారం నామపత్రం దాఖలు చేశారు గంభీర్​. ప్రమాణ పత్రంలో స్థిర, చర ఆస్తులన్ని కలిపి రూ. 141 కోట్లుగా పేర్కొన్నారు.

దిల్లీ లోక్​సభ అభ్యర్థుల ఆదాయంలో గంభీర్​ టాప్​

By

Published : Apr 24, 2019, 9:02 AM IST

దిల్లీ లోక్​సభ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ప్రధాన పార్టీలు క్రీడాకారుల్ని బరిలోకి దింపాయి. ఒలింపిక్​ విజేత విజేందర్​ సింగ్​ను కాంగ్రెస్, మాజీ క్రికెటర్​ గౌతం గంభీర్​ను భాజపా సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిపాయి.

తూర్పు దిల్లీ తరఫున భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న గంభీర్​ మంగళవారం నామపత్రం దాఖలు చేశారు. తన ఎన్నికల అఫిడవిట్​లో ఆస్తులు రూ. 141 కోట్లుగా ప్రకటించారు. దిల్లీలోని మొత్తం 7 స్థానాల అభ్యర్థులందరిలో గంభీర్​ అత్యంత సంపన్నులుగా నిలిచారు.

కాంగ్రెస్​ అభ్యర్థి ఒలింపిక్​ పతక విజేత.. విజేందర్​ సింగ్​ ఆస్తులు.. రూ. 8. 62 కోట్లు. దిల్లీ భాజపా అధ్యక్షుడు మనోజ్​ తివారీ ఆస్తులు రూ. 24 కోట్లుగా ప్రమాణ పత్రంలో పేర్కొన్నారు. 2014తో పోలిస్తే ఈయన ఆస్తులు.. రూ. 4.33 కోట్లు పెరిగాయి.

దక్షిణ దిల్లీ భాజపా అభ్యర్థి రమేశ్​ బిధురి రూ. 18 కోట్లు, ఆమ్​ ఆద్మీ అభ్యర్థి రాఘవ్​ చద్ధా చరాస్తులు రూ. 1.37 కోట్లు, స్థిరాస్తులు రూ. 11.80 కోట్లుగా ఎన్నికల అఫిడవిట్​లో సమర్పించారు.

అభ్యర్థి ఆస్తులు స్థానం
గంభీర్​(భాజపా) 141 కోట్లు తూర్పు దిల్లీ
రమేశ్​ బిధురి(భాజపా) 18 కోట్లు దక్షిణ దిల్లీ
రాఘవ్​ చద్ధా(ఆప్​) 13. 17 కోట్లు దక్షిణ దిల్లీ
విజేందర్​ సింగ్​(కాంగ్రెస్​) 8.62 కోట్లు దక్షిణ దిల్లీ
మనోజ్​ తివారీ(భాజపా) 24 కోట్లు ఈశాన్య దిల్లీ
షీలా దీక్షిత్​(కాంగ్రెస్​) 4.92 కోట్లు ఈశాన్య దిల్లీ

ఇదీ చూడండి: భోపాల్​ స్థానానికి భాజపా మరో నామపత్రం

ABOUT THE AUTHOR

...view details