కరోనా మహమ్మారి కట్టడికి విధించిన లాక్డౌన్ ప్రయోజనాలు అన్‌లాక్(ఆంక్షల ఎత్తివేత)తో కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు ప్రజారోగ్య సంరక్షణ నిపుణులు రమణ ధార. వైరస్ బారి నుంచి గ్రామీణ ప్రజలను కాపాడాలని, భారీ స్థాయిలో కేసుల వ్యాప్తి జరిగితే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.
" అన్‌లాక్ వల్ల ప్రజలు భౌతిక దూరం పాటించకపోవటం, మాస్కులు సరైన పద్ధతిలో వినియోగించకపోవటం వంటి పాత అలవాట్లకు వెళతారు. వలస కార్మికుల సంరక్షణకు చర్యలు చేపట్టాలి. గ్రామీణ ప్రాంతాల్లో వారి ఇళ్లకు సమీపంలోనే క్వారంటైన్ చేయాలి. తద్వారా వలస కార్మికుల రాకపై ఎలాంటి ఆందోళన లేకుండా ప్రజలకు వైరస్ నుంచి రక్షణ లభిస్తుంది. సరిపడా పరీక్ష కిట్లు, సరైన వైద్య సౌకర్యాలు లేని పల్లెల్లో కేసులు భారీగా పెరుగుతాయి. లాక్‌డౌన్‌తో చేకూరిన ప్రయోజనం ప్రస్తుత అన్‌లాక్‌తో కోల్పోవచ్చు."
- రమణ ధార, ప్రొఫెసర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, హైదరాబాద్,