గగన్యాన్ యాత్ర కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సమాయత్తం అవుతోంది. ఇందుకోసం భారత వ్యోమగాములకు శిక్షణ ఇచ్చేందుకు రష్యాకు చెందిన గ్లావ్కోస్మాస్తో ఒప్పందం కుదిరింది.
ఇస్రోలోని మానవ అంతరిక్ష నౌకా కేంద్రం (హెచ్ఎస్ఎఫ్సీ) డైరెక్టర్ ఎస్ ఉన్నికృష్ణన్ నాయర్, గ్లోవ్కోస్మాస్ డిప్యూటీ డీజీ నటాలియా లోక్తేవా ఈ ఒప్పందంపై జూన్ 27న సంతకం చేశారు. ఇందులో భాగంగా ఎంపిక, వైద్య పరీక్షలు, అంతరక్ష శిక్షణ బాధ్యతలను ఈ సంస్థ నిర్వర్తిస్తుంది. ఈ విషయాన్ని గ్లోవ్కోస్మాస్ సంస్థ తన వెబ్సైట్లో ప్రచురించింది.