తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'గడ్కరీ ఉంటే మహా ప్రతిష్టంభనకు రెండు గంటల్లో తెర' - మహారాష్ట్ర రాజకీయ సంక్షోభాన్ని నితిన్ గడ్కరీ 2 గంట్లలోనే పరిష్కరిస్తారు

మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సందిగ్ధతను తొలగించడానికి ఆర్​ఎస్​ఎస్ అధినేత మోహన్ భగవత్ కలుగజేసుకోవాలని రైతు ఉద్యమనేత కిశోర్ తివారీ విజ్ఞప్తి చేశారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అయితే ఈ సమస్యను కేవలం రెండు గంటల్లోనే పరిష్కరించేస్తారని అభిప్రాయపడ్డారు.

అశోక్​ తివారీ, శివసేన నేత

By

Published : Nov 5, 2019, 6:11 PM IST

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న సందిగ్ధతను తొలగించే విషయంలో ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ మోహన్​ భగవత్ కలుగజేసుకోవాలని రైతు ఉద్యమనేత కిశోర్ తివారీ అభ్యర్థించారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని మహారాష్ట్ర సమస్య పరిష్కారానికి వినియోగించాలని భగవత్​కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

"మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఆర్​ఎస్​ఎస్​ మౌనంగా ఉండడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గడ్కరీ అయితే ఈ సమస్యను కేవలం 2 గంటల్లోనే పరిష్కరించగలుగుతారు." - కిశోర్​తివారీ, శివసేన నేత

ఎన్నికలకు ముందు శివసేనలో

కిశోర్​ తివారీ విదర్భ జన్​ అందోళన్​ సమితిని స్థాపించారు. మహారాష్ట్రలో ముఖ్యంగా విదర్భలో రైతు ఆత్మహత్య నివారణకు కృషి చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు భాజపా నుంచి శివసేనలోకి వెళ్లారు.

ముఖ్యమంత్రి పీఠం కోసం

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా, శివసేన కూటమి మెజారిటీ సాధించింది. అయితే ముఖ్యమంత్రి పీఠంపై ఇరుపార్టీల మధ్య విభేదాలు వచ్చాయి. చెరోసగం పాలన చేపట్టాలని శివసేన కోరుతుండగా, ఫడణవీస్​ మాత్రమే సీఎం అవుతారని భాజపా అంటోంది. ఫలితంగా ఎన్నికల ఫలితాలు వెలువడి 11 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం ఏర్పడలేదు.

ఇదీ చూడండి: ఆదర్శం: అప్పు ఇవ్వలేదని బ్యాంకే పెట్టేసింది

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details