కొద్ది రోజులుగా మానవాళిని ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న కరోనా మహమ్మారి.. అయిన వారి అంత్యక్రియలకూ నోచుకోకుండా చేస్తోంది. కరోనా సోకి ఓ వ్యక్తి మృతి చెందితే.. కుటుంబ సభ్యులకు ఆఖరి చూపూ కరవవుతోంది. వైద్య సిబ్బందే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో మృతదేహాలపట్ల అమానవీయంగా ప్రవర్తిస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. కొవిడ్‌తో చనిపోయినవారిని అగౌరవ పరచరాదని కేంద్రం వెల్లడించిన మరుసటి రోజే కర్ణాటకలో మృతదేహాన్ని తాళ్లతో లాక్కెళ్లిన అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది.
బెళగావి జిల్లా గొకాక తాలుకాలో కరోనాతో ఓ 92 ఏళ్ల వృద్ధుడు మరణించగా.. అతడి మృతదేహాన్ని తాళ్లతో కట్టి లాక్కెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు వైద్య సిబ్బంది.