తేజస్ యుద్ధ విమానం నుంచి ఇంధన ట్యాంక్ కిందపడిన ఘటన తమిళనాడు కోయంబత్తూరులో చోటుచేసుకుంది.
తేజస్ యుద్ధ విమానం నుంచి 1200 లీటర్ల ఇంధన ట్యాంకు ఇరుగూరు ప్రాంతంలోని పంట పొలాల్లో పడింది. ట్యాంకు పడిన ధాటికి 3 అడుగుల లోతు గుంత ఏర్పడి.. చిన్నస్థాయిలో మంటలు చెలరేగాయి. అయితే నగర శివార్లలో ఈ ఘటన జరగడం వల్ల ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ దృశ్యాలు చూసి స్థానిక గ్రామ వ్యవసాయ కూలీలు ఆశ్చర్యపోయారు.