తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్లాస్టిక్​పై పోరు: వ్యర్థాల నుంచి ఇంధనం తయారు - plastic news latest

శిలాజ ఇంధనాలు తగ్గిపోవడం, ప్లాస్టిక్​ వాడకం పెరిగిపోవడం.... మానవాళి ముందున్న రెండు ప్రధాన సవాళ్లు. ఈ రెండింటినీ అధిగమించేందుకు తిరుగులేని మార్గం కనుగొంది పుణె పురపాలక సంస్థ. ప్లాస్టిక్​ వ్యర్థాలతో ఇంధన తయారీ ప్రారంభించింది. పర్యావరణానికి పెను ముప్పుగా మారిన ప్లాస్టిక్​ భూతంపై పోరాడుతూనే... భవిష్యత్​ ఇంధన అవసరాలు తీర్చుకునేందుకు మేలైన మార్గం చూపింది.

Fuel extraction from plastic waste
ప్లాస్టిక్​పై పోరు: వ్యర్థాల నుంచి ఇంధనం తయారు

By

Published : Dec 23, 2019, 7:32 AM IST

ప్లాస్టిక్​పై పోరు: వ్యర్థాల నుంచి ఇంధనం తయారు

శిలాజ ఇంధనాలు చాలా వేగంగా తరిగిపోతున్నాయి. విచ్చలవిడి వినియోగంతో పర్యావరణానికి తీరని నష్టాన్ని మిగులుస్తున్నాయి. పెరిగిపోతున్న భూతాపాన్ని తగ్గించేందుకు ఇప్పటికే చాలా దేశాలు శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించాయి. ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరిస్తున్నాయి.
శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయాన్ని చూపుతోంది మహారాష్ట్రలోని పుణె పురపాలక సంస్థ. ప్లాస్టిక్​ వ్యర్థాల నుంచి ఇంధనాన్ని తయారు చేస్తోంది. నగరవ్యాప్తంగా ఇంధన తయారీ కేంద్రాలు నిర్మిస్తోంది. ఇప్పటికే కొన్నింట్లో ఉత్పత్తి ప్రారంభమైంది కూడా.

ఇందుకోసం వేర్వేరు ప్రైవేటు సంస్థలతో అనుసంధానమైంది పుణె పురపాలక సంస్థ. ఇంధన ఉత్పత్తి తర్వాత మిగిలిపోయే వ్యర్థాలను రోడ్లు నిర్మించటం సహా ఇతర అవసరాలకు వినియోగిస్తోంది పీఎంసీ.

"పునర్వినియోగం చేయలేని టూత్​ బ్రష్​లు, బిస్కెట్​ ప్యాకెట్ల కవర్ల వంటి వాటిని ద్రవ ఇంధనంగా మార్చుతున్నాం. దానిని జనరేటర్లు, బాయిర్లలో వినియోగిస్తున్నాం. ఇందులో వెలువడే గ్యాస్​నూ యంత్రాలలో ఉపయోగిస్తున్నాం. ఈ చిన్న ప్లాంట్లను నిర్మించటం ద్వారా ప్లాస్టిక్​ వ్యర్థాలను నిర్మూలించవచ్చు."
- మేధ తాడ్పత్రికర్​, రుద్ర ఈఎన్వీ సొల్యూషన్​.

" ప్లాస్టిక్​ అనేది మన నిత్యజీవితంలో ఎంతో ముఖ్యమైన భాగం. ఉదయం లేవగానే ముందుగా వినియోగించేది టూత్​ బ్రష్​. అది ప్లాస్టిక్​తో తయారైందే. ప్లాస్టిక్​పై నిషేధం విధించటం సరైన పరిష్కారం కాదు. వాటిని పునర్వినియోగించటం అనేది సరైన ఆలోచన. మేము ఉపయోగించే డీపోలిమరైజేషన్​ ప్రక్రియ ప్లాస్టిక్​ సమస్యకు ముగింపు. ఈ ప్లాంట్లలో ఉత్పత్తి అయ్యే ఇంధనం, కార్బన్​ వ్యర్థాలను మార్కెట్లో విక్రయిస్తున్నాం."

- పోరస్​ భగవత్​, రుద్ర ఈఎన్వీ సొల్యూషన్​ మేనేజర్​.

ప్రస్తుతం పుణెలోని జెథురి, నారాయణపేట్​లో రెండు ఇంధన తయారీ ప్లాంట్లు ఉన్నాయి. వివిధ వార్డుల నుంచి ప్లాస్టిక్​ వ్యర్థాలను సేకరించి ఇక్కడకు తరలిస్తున్నారు. 10 కిలోల ప్లాస్టిక్​తో ఆరు లీటర్ల ఇంధనం తయారువుతోంది.

ఇదీ చూడండి: మజిలీలో 'స్ట్రీట్​ ఆఫ్​ చెన్నై' సంగీత మాయాజాలం

ABOUT THE AUTHOR

...view details