తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​ గజగజ... గడ్డకట్టిన దాల్ సరస్సు - గట్టకట్టిన దాల్​ సరస్సు

జమ్ముకశ్మీర్​లో రెండో అతిపెద్దదైన దాల్ సరస్సు పాక్షికంగా గడ్డకట్టింది. సరికొత్తగా దర్శనమిస్తోన్న సరస్సును చూసి పర్యటకులు సరికొత్త అనుభూతి పొందుతున్నారు.

frozen Dal Lake at jammu kashmir
కశ్మీర్​ గజగజ... గడ్డకట్టిన దాల్ సరస్సు

By

Published : Dec 31, 2019, 8:06 PM IST

చలిపంజాకు జమ్ముకశ్మీర్​ విలవిల్లాడుతోంది. మైనస్ ఉష్ణోగ్రతలతో అక్కడి ప్రజానీకం గజగజ వణుకుతోంది. ఎక్కడికక్కడ నీరు... మంచులా మారుతోంది. తాజాగా శ్రీనగర్​లో పర్యటకంగా ప్రాముఖ్యం పొందిన దాల్ సరస్సు పాక్షికంగా గడ్డకట్టింది.

గడ్డకట్టి సరికొత్తగా దర్శనమిస్తోన్న సరస్సును చూసేందుకు పర్యటకులు తరలివస్తున్నారు.

ఇక్కడకు నేను ఎప్పుడూ రాలేదు. దాల్ సరస్సును ఇప్పుడు చూద్దామని వస్తే అది చలికి గడ్డకట్టింది. వాతావరణం చాలా చల్లగా ఉంది. ఈ ప్రాంతం ఒక స్వర్గంలా ఉంది. ఇక్కడికి రావడం నాకు ఆనందంగా ఉంది.

-పర్యటకుడు

నేను ఇక్కడకు ఇది వరకు వచ్చా. సరస్సును చూశా. మా నాన్న 1964లోనే వచ్చారు. ఇప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చా. కశ్మీర్​కు వస్తే స్వర్గానికి వచ్చిన అనుభూతి కలుగుతుంది.

-పర్యటకురాలు

ABOUT THE AUTHOR

...view details