పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు అట్టుడుకుతుంటే.. తాజాగా ఈ చట్టానికి అనుకూలంగా సుప్రీంకోర్టులో తొలిసారిగా పిటిషన్ దాఖలైంది. దీనికి రాజ్యాంగ చట్టబద్ధత కల్పించడం సహా చట్టంపై వదంతులను వ్యాపింప జేస్తున్న రాజకీయ పార్టీలపై కఠిన చర్యలు తీసుకునేలా.. ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని ముంబయి వాసి పునీత్ కౌర్ ధండా పిటిషన్ దాఖలు చేశారు.
పౌరసత్వ చట్టానికి అనుకూలంగా సుప్రీంలో పిటిషన్
పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దేశంలో ఆందోళనలు చెలరేగుతున్న వేళ.. ఈ చట్టానికి అనుకూలంగా సుప్రీంకోర్టులో తొలిసారిగా పిటిషన్ దాఖలైంది. దీనికి రాజ్యాంగ చట్టబద్ధత కల్పించాలని ఓ ముంబయి వాసి ఈ వ్యాజ్యం దాఖలు చేశారు.
పౌరసత్వ చట్టానికి అనుకూలంగా సుప్రీంలో పిటిషన్ దాఖలు
ఈ చట్టం గురించి విస్తృతంగా ప్రచారం చేసేలా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని ఇందులో అభ్యర్ధించారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా తప్పుడు సమాచారం చేస్తున్న మీడియా సంస్ధలపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి:బంగాల్లో 'పౌర' ఆందోళనలు తీవ్రం.. ఈశాన్యాన తగ్గుముఖం