తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లాక్​డౌన్​ 2.0: ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు? - కరోనా వైరస్​ వార్తలు

మే 3 వరకు దేశం లాక్​డౌన్​లోనే ఉండనుంది. ఇందుకోసం తాజా మార్గదర్శకాలను జారీ చేసింది కేంద్రం. కొన్ని నిబంధనల్ని మరింత కఠినతరం చేసింది. మరికొన్నింటిని సడలించింది. ఏప్రిల్​ 20 నుంచి.. హాట్​స్పాట్​లు కాని ప్రాంతాల్లో ప్రత్యేక కార్యకలాపాలకు అనుమతులిచ్చింది. ఈ మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు స్పష్టం చేసింది.

Fresh guidelines issued for COVID lockdown 2.0, govt bars all publicactivities
లాక్​డౌన్​ 2.0: ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు?

By

Published : Apr 15, 2020, 12:22 PM IST

Updated : Apr 15, 2020, 1:01 PM IST

దేశంలో కరోనా వైరస్​ విజృంభిస్తున్న తరుణంలో లాక్​డౌన్​ 2.0కు మార్గదర్శకాలు జారీ చేసింది కేంద్ర హోంశాఖ. మే 3 వరకు రైళ్లు, విమాన సేవలు, సినిమా హాళ్లు, బార్లు తదితర వాటిపై ఉన్న నిషేధాన్ని కొనసాగించింది.

అయితే లాక్​డౌన్​ వల్ల ప్రజలు పడే ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని ప్రత్యేక కార్యకలాపాలకు అనుమతినిచ్చింది కేంద్రం. వీటి అమలుకు ముందే కేంద్రపాలిత, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని స్పష్టం చేసింది. కార్యాలయాలు, ఫ్యాక్టరీలు తదితర ప్రాంతాల్లో భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు చేపట్టాలని నిర్దేశించింది.

ఈసారి హాట్​స్పాట్​ ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది కేంద్రం. నిత్యావసరాలు మినహా ఎలాంటి కార్యకలాపాలు సాగకుండా చూడాలని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలకు సూచించింది. కేంద్ర మార్గదర్శకాలతో పాటు వైరస్​ కట్టడికి అవసరమైతే మరిన్ని కఠిన చర్యలు చేపట్టవచ్చని ఆయా ప్రభుత్వాలకు సిఫార్సు చేసింది. అయితే ఏప్రిల్​ 20 అనంతరం సాగే ప్రత్యేక కార్యకలాపాలేవీ హాట్​స్పాట్​ ప్రాంతాల్లో అమలు కావు.

మార్గదర్శకాలివే...

లాక్​డౌన్​ మార్గదర్శకాలివే...

ఇదీ చూడండి:-భారత గబ్బిలాల్లో కరోనా వైరస్‌

Last Updated : Apr 15, 2020, 1:01 PM IST

ABOUT THE AUTHOR

...view details