మహిళా దినోత్సవం నుంచి ఓ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైంది ఉత్తర్‌ప్రదేశ్‌లోని నొయిడా మెట్రోరైల్ కార్పొరేషన్. 21 స్టేషన్లలో మహిళలకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్లు అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆయా స్టేషన్లలో శానిటరీ ప్యాడ్ వెండింగ్ మిషన్లను ఏర్పాటు చేస్తోంది.
రెండు పింక్ స్టేషన్లు
మహిళలకు ప్రత్యేకంగా రెండు పింక్ స్టేషన్లను ప్రారంభించనుంది ఎన్ఎంఆర్సీ. నోయిడాలోని సెక్టార్76, గ్రేటర్ నోయిడాలోని పారి చౌక్ స్టేషన్లను ఇందు కోసం వినియోగిస్తున్నారు.
" పింక్ స్టేషన్లలో మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. చిన్నారులకు పాలు పట్టేందుకు ప్రత్యేక గదులు, డైపర్లు మార్చేందుకు, బట్టలు మార్చుకునేందుకు సౌకర్యాలు చేశాం. ఈ రెండు స్టేషన్లలో పూర్తి స్థాయిలో మహిళా ఉద్యోగులను నియమించాలనే లక్ష్యంతో ఉన్నాం. 21 స్టేషన్లలో శానిటరీ న్యాప్కిన్ వెండింగ్ మిషన్లు ఏర్పాటు చేస్తాం. ఏ ప్రయాణికురాలైనా వారు పొందిన టోకెన్ ద్వారా ఉచితంగా శానిటరీ ప్యాడ్‌ను తీసుకోవచ్చు. " - ఎన్ఎంఆర్సీ అధికారి.
ఏస్ సంస్థ సహకారంతో..
ఈ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా పింక్ స్టేషన్లను, వెండింగ్ మిషన్లను ఎన్ఎంఆర్సీ ఎంపీ రీతూ మహేశ్వరి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాన్ని స్థిరాస్తి వ్యాపార సంస్థ ఏస్(ఏసీఈ) సహకారంతో చేపడుతోంది ఎన్ఎంఆర్సీ. ఏడాది పాటు ఏస్ గ్రూప్ సంస్థలకు చెందిన ఏస్ స్టూడియో విభాగం న్యాప్కిన్ల ఖర్చును బరించనుంది.
ఇదీ చూడండి:టాప్-100 శక్తిమంతమైన మహిళల్లో ఇందిరా గాంధీ, కౌర్