తెలంగాణ

telangana

'మా దగ్గర ఆ వస్తువు కొంటే కిలోన్నర ఉల్లి ఫ్రీ'

By

Published : Dec 11, 2019, 10:56 AM IST

Updated : Dec 11, 2019, 5:50 PM IST

దేశంలో ఉల్లిగడ్డల ఘాటుకు ప్రతి రోజూ వింత వార్తలు వింటున్నాం. ఒకరేమో ఉల్లి దొంగతనం చేస్తుంటే... మరికొందరు వినియోగాన్ని ఆపేస్తున్నారు. కొన్ని చోట్ల మంచి ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఇలానే ఓ వ్యక్తి తన వ్యాపార అభివృద్ధి కోసం.. ప్రజలను ఆకర్షించేందుకు ఉల్లిపాయలనే ఉచితంగా ఇస్తానంటూ ప్రకటన చేశాడు.

onion computer
ఈ వస్తువు కొనండి.. కేజిన్నర ఉల్లిగడ్డలు పట్టుకెళ్లండి..!

'మా దగ్గర ఆ వస్తువు కొంటే కిలోన్నర ఉల్లి ఫ్రీ'

సాధారణంగా ఎవరైనా కృతిమ మేధ కలిగిన కంప్యూటర్​ కొనుక్కుంటే ఆఫర్​ కింద ఏమిస్తారు? వైర్​లెస్​ కీ బోర్డ్​, మౌస్​, హెడ్​ ఫోన్స్​​, పెన్​ డ్రైవ్ ఇలా సంబంధిత వస్తువులేవైనా ఉచితంగా ఇస్తారమో..! కానీ తమిళనాడు కడలూరుకు చెందిన 'తమిళ్​ కంప్యూటర్స్' సేల్స్​ షాపు యజమాని వినూత్న ఆఫర్​ పెట్టాడు.

ఈ వస్తువు కొనండి.. కేజిన్నర ఉల్లిగడ్డలు పట్టుకెళ్లండి..!

ఓ కంప్యూటర్​ కొంటే కేజిన్నర ఉల్లిపాయలు ఉచితంగా ఇస్తానంటూ ప్రకటించాడు. ఈ విషయాన్ని ఫ్లెక్సీపై ప్రింట్​ చేయించి... తన షాపు ముందు పెట్టాడు. అంతే ఈ ప్రకటన ప్రజలను విపరీతంగా ఆకర్షించింది. ఇప్పుడా ప్రజలు తన షాపు గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారట. ప్రస్తుతం... ఉల్లికి భారీగా డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఇలా చేస్తున్నానని చెప్పుకొచ్చాడు.

దేశంలో ఉల్లి ధరలు కొండెక్కిన సంగతి తెలిసిందే. కిలో ధర రూ.200 వరకు పలుకుతుంది. ఈ కారణంగా.. పలు చోట్ల ఉల్లిగడ్డలు దొంగతనానికి గురవుతున్నాయి. పలు భోజనశాలల్లో ఉల్లిగడ్డల వినియోగం ఆపేశారు.

ఇదీ చూడండి : 'ఉల్లి' దొంగతనాలే దేశంలో నయా ట్రెండ్​!

Last Updated : Dec 11, 2019, 5:50 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details