రక్షా బంధన్ సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు కానుకనిచ్చింది. అన్ని కేటగిరీల మహిళలకు ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం అర్ధరాత్రి వరకు.. ఉచితంగా బస్సు సర్వీసును అందించనున్నట్టు ప్రకటించింది యూపీఎస్ఆర్టీసీ.
రక్షా బంధన్ నేపథ్యంలో స్వీట్ షాపులు, రాఖీలు అమ్మే దుకాణాలు ఆదివారం తెరిచే ఉంటాయని అధికారులు తెలిపారు. దీనితో పాటు విస్తృతంగా పెట్రోలింగ్ చేయాలని పోలీసులను ఆదేశించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ రక్షా బంధన్‌ను జరుపుకునేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్.