త్వరలోనే జరగనున్న దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కసరస్తు ముమ్మరం చేసింది అధికార ఆమ్ ఆద్మీ పార్టీ. ఓటర్లను ఆకట్టుకునేందుకు పలు ప్రకటనలు చేస్తోంది. తమ పార్టీని మరోమారు అధికారంలోకి తీసుకొస్తే.. ప్రస్తుతం కొనసాగుతోన్న మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని మరో ఐదేళ్లు కొనసాగిస్తామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. దీంతో పాటు 200 యూనిట్ల లోపు వారికి అందించే ఉచిత విద్యుత్ పథకాన్నీ కొనసాగిస్తామన్నారు.
ఈ మేరకు సిరాస్పూర్లోని 1,164 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఈ ప్రకటన చేశారు కేజ్రీవాల్. విపక్షాల విమర్శలను పట్టించుకోకుండా.. ప్రజాసంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు.