గుజరాత్ జామ్నగర్లో ఏటా పవన్ పండుగ ఘనంగా జరుగుతుంది. భక్తులంతా శివ సేవలో నిమగ్నమవుతారు. ఈ పర్వదినాన దేశవ్యాప్తంగా ప్రజలు శివనామాలు జపిస్తారు.
ఈ సారి సౌరాష్ట్రలోని చిన్న కాశీగా పేరొందిన విశ్వేశ్వరాలయంలో ఓ విదేశీ శివ భక్తురాలు సందడి చేస్తోంది. మహాదేవున్ని భక్తితో కొలుస్తూ ఆనందాన్ని ఆస్వాదిస్తోంది.
రొమేనియా దేశానికి చెందిన ఫ్రాన్సెస్కా ఫిలిప్ ఐదేళ్ల క్రితం జామ్‌నగర్ ఆయుర్వేద విశ్వవిద్యాలయంలో చదువుకునేందుకు వచ్చింది. ఆ వైద్యేశ్వరుడికి భక్తురాలయిపోయింది. శివుడంటే మహా ఇష్టం. హిందూ తత్వాలన్నా అంతే. అందుకే హిందీ నేర్చుకుని మరీ, మహా మృత్యుంజయ మంత్రం పొల్లుపోకుండా స్మరించేస్తోంది. దేవుడి పట్ల భక్తికి వర్ణం, భాష తేడాలు లేవని చాటిచెప్తోంది.