తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'గగన్​యాన్'​ కోసం భారత వైద్యులకు ఫ్రాన్స్​ శిక్షణ - తెలుగు తాజా వార్తలు

గగన్​యాన్​ వ్యోమగాముల ఆరోగ్యాన్ని పర్యవేక్షించే భారత శస్త్రచికిత్స నిపుణులకు ఫ్రాన్స్​ రెండు వారాల పాటు శిక్షణ ఇవ్వనుంది . 2022 నాటికి మానవ సహిత అంతరిక్ష యాత్ర కోసం గగన్​యాన్​ ప్రాజెక్టును ప్రారంభించింది ఇస్రో.

France to train Indian flight surgeons for Gaganyaan mission
'గగన్​యాన్'​ విమాన సర్జన్లకు ఫ్రాన్స్​ శిక్షణ

By

Published : Jan 22, 2020, 4:56 AM IST

Updated : Feb 17, 2020, 10:55 PM IST

ప్రతిష్ఠాత్మక అంతరిక్ష ప్రయోగం 'గగన్​యాన్'​ కోసం ఎంపిక చేసిన వ్యోమగాముల ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు వీలుగా.. భారత వైద్యులకు ఫ్రాన్స్​ రెండు వారాల పాటు శిక్షణ ఇవ్వనుంది. 2022 నాటికి ముగ్గురు భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపే లక్ష్యంతో గగన్​యాన్​ ప్రాజెక్టును ప్రారంభించింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)​. ఈ నేపథ్యంలో శస్త్ర చికిత్స నిపుణులకు శిక్షణ కీలకం కానుంది.

భారత వాయుసేనకి వైద్యులుగా ఉంటూ.. ఏవియేషన్​ మెడిసిన్​లో నిపుణులైన సర్జన్లను షార్ట్​ లిస్ట్​ చేసి ఈ ప్రాజెక్టుకు ఎంపిక చేయనున్నారు. వారికి రెండు వారాలపాటు ఫ్రాన్స్​లో శిక్షణ ఇవ్వనున్నట్లు ఇస్రో తెలిపింది.

2018లోనే ఒప్పందం

ఫ్రాన్స్​లో అంతరిక్ష వైద్యసేవల పరంగా మంచి యంత్రాంగం ఉంది. సీఎన్​ఈఎస్​ అనుబంధ సంస్థ మెడెస్​ స్పేస్​ క్లీనిక్ కూడా ఉంది. ఇక్కడ స్పేస్ సర్జన్లు శిక్షణ పొందుతారు. అయితే శిక్షణ నిమిత్తం వ్యోమగాములను ఫ్రాన్స్​కు పంపాలా.. వద్దా అనే అంశంపై భారత్​ సమగ్రంగా చర్చిస్తున్నట్లు అధికారులు తెలిపారు​.

ప్రస్తుతం అన్ని పరీక్షలను నెగ్గి ఎంపికైన నలుగురు వ్యోమగాములు రష్యాలో 11నెలల పాటు శిక్షణ తీసుకుంటున్నారు. గగన్​యాన్​ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించే కొన్ని నెలల ముందు.. 2018 మార్చిలో భారత్​- ఫ్రాన్స్​ పరస్పర అంతరిక్ష సహకారం కోసం ఒప్పందం కుదుర్చుకున్నాయి.

ఇదీ చూడండి:- హృతిక్​ను అభిమానించినందుకు భార్యను చంపిన భర్త!

Last Updated : Feb 17, 2020, 10:55 PM IST

ABOUT THE AUTHOR

...view details