కరోనా వైరస్ ఎన్నో సవాళ్లు విసురుతున్నప్పటికీ... రఫేల్ యుద్ధ విమానాలను అనుకున్న సమయానికే భారత్కు అందించడానికి కట్టుబడి ఉన్నట్టు ఫ్రాన్స్ స్పష్టంచేసింది. ఫ్రాన్స్ రక్షణమంత్రి ఫ్లారెన్స్ పార్లేతో జరిగిన టెలిఫోన్ సంభాషణ అనంతరం భారత రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ విషయాన్ని వెల్లడించారు.
"ఫ్రాన్స్ రక్షణమంత్రి ఫ్లారెన్స్ పార్లేతో టెలిఫోన్ సంభాషణ జరిపాను. కరోనా సంక్షోభం, ప్రాంతీయ భద్రత సమస్యలపై చర్చతో పాటు ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని అంగీకరించాం. కరోనాపై పోరులో ఫ్రాన్స్, భారత సైనికుల కృషిని అభినందించాం. కరోనా వైరస్ ఎన్ని సవాళ్లు విసిరినప్పటికీ.. రఫేల్న్ను అనుకున్న సమయానికి కచ్చితంగా భారత్కు అప్పగిస్తామని ఫ్రాన్స్ హామీనిచ్చింది."
-- రాజ్నాథ్ సింగ్, భారత రక్షణ మంత్రి.