ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వంపై ఫ్రాన్స్ మద్దతుగా నిలిచింది. మండలిని విస్తరించాలని ఐరాసను కోరతామని ఫ్రాన్స్ మరోసారి స్పష్టంచేసింది. యూఎన్ఎస్సీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే భారత్‌కు ఫ్రాన్స్ మద్దతివ్వడం విశేషం.
ఎప్పటినుంచో ఐరాస భద్రతా మండలిలో శాస్వత సభ్యత్వం కోసం ప్రయత్నిస్తున్న భారత్... బ్రెజిల్, జపాన్, జర్మనీ, జపాన్లకూ ఇవ్వాలని కోరుతోంది. ఈ దేశాలన్నీ శాశ్వత సభ్యత్వానికి అర్హమైనవేనని భారత్ భావిస్తోంది.
ఐరాస భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం ఉన్న 15 దేశాల్లో ఫ్రాన్స్ ఒకటి. జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని ఫ్రాన్స్ ఐరాస భద్రతా మండలికి ప్రతిపాదించింది. అమెరికా, బ్రిటన్ ఈ ప్రతిపాదనకు మద్దతిచ్చాయి.
"భద్రతా మండలిలో శాశ్వత, తాత్కాలిక సభ్య దేశాల సంఖ్యను పెంచాలని మేం కోరుకుంటున్నాం. భారత్, బ్రెజిల్, జర్మనీ, జపాన్ దేశాలు ఐరాసలో కీలకంగా ఉండాలనేదే మా భావన"-ఐరాసలో ఫ్రాన్స్ ప్రతినిధి డెలాట్రే
జర్మనీ ఏప్రిల్‌లో ఐరాస భద్రతా మండలిలో చేరనుంది.
ఫ్రాన్స్, జర్మనీ ముక్తకంఠంతో ఐరాస భద్రతా మండలిలో సంస్కరణలు తేవాలని కోరతాయని డెలాట్రే తెలిపారు. ఒకవేళ సంస్కరణలు జరగకుంటే... భద్రతా మండలి ధర్మం తప్పినట్టేనని, ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తామని వెల్లడించారు.