తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రఫేల్​ ఎంట్రీకి ముందు ఫ్రాన్స్​ కీలక వ్యాఖ్యలు - రఫేల్​

ఫ్రాన్స్​ రక్షణమంత్రి ఫ్లోరెన్స్​ పార్లె గురువారం భారత్​లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో తమ ఆసియా వ్యూహాత్మక భాగస్వామి భారత్​ అని ఫ్రాన్స్​ వెల్లడించింది. పార్లె పర్యటనతో ఇరు దేశాల మైత్రి బలోపేతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

France describes India as foremost Asian strategic partner
'ఆసియా వ్యూహాత్మక భాగస్వామ్యంలో భారత్​ కీలకం'

By

Published : Sep 9, 2020, 4:29 PM IST

భారత్​ను ఆసియా వ్యూహాత్మక భాగస్వామిగా అభివర్ణించింది ఫ్రాన్స్​. ఆ దేశ​ రక్షణమంత్రి ఫ్లోరెన్స్​ పార్లె గురువారం భారత్​లో పర్యటించనున్న నేపథ్యంలో ఫ్రాన్స్​ ఈ వ్యాఖ్యలు చేసింది. ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని మరింత బలపరుచుకునేందుకు పార్లె పర్యటన ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

తొలి బ్యాచ్​ రఫేల్​ విమానాలను భారత వాయుసేనలో అధికారికంగా చేర్చేందుకు అంబాలా ఎయిర్​బేస్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమం కోసం గురువారం భారత్​కు రానున్నారు పార్లె.

పర్యటనలో భాగంగా రక్షణమంత్రి రాజ్​నాథ్​, జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ డోభాల్​తో సమావేశంకానున్నారు పార్లె. ఇండో-పసిఫిక్​ ప్రాంతంలో భద్రత, ఉగ్రవాద నిరోధక చర్యల్లో సహకారం, ద్వైపాక్షిక రక్షణ భాగస్వామ్యం బలోపేతం దిశగా వీరి మధ్య చర్చలు జరగనున్నట్టు ఫ్రాన్స్ రాయబార కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

గత కొన్నేళ్లలో భారత్​- ఫ్రాన్స్​ మధ్య మైత్రి మరింత బలపడింది. కీలక రంగాల్లో ఒప్పందాలు, సహకారాలతో ఇరు దేశాలు తమ బంధాన్ని దృఢ పరుచుకుంటున్నాయి.

ఇదీ చూడండి:-గగన్​యాన్ వ్యోమగాములకు ఫ్రాన్స్ పరికరాలు

ABOUT THE AUTHOR

...view details