ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ పలు వ్యాపార అవకాశాలను సృష్టిస్తుందన్నారు ప్రధాని మోదీ. ఉద్యోగ అవకాశాలు మెరుగుపర్చి ఆర్థిక వృద్ధికి దోహదపడతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
'వ్యాపార, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి' "విత్త మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించి ఆర్థిక ప్యాకేజీ... రక్షణ, వైమానిక, అంతరిక్ష, అణు శక్తి, ఖనిజ, బొగ్గు వంటి పలు ప్రముఖ రంగాలకు ఊతమిస్తుంది." -ప్రధాని నరేంద్ర మోదీ
స్వాగతించిన సైనిక నిపుణులు
దేశీయ రక్షణ పరిశ్రమను ప్రోత్సహించడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేపట్టిన సంస్కరణ చర్యలను సైనిక నిపుణులు స్వాగతించారు. ఈ నిర్ణయంతో ఆయుధాల దిగుమతి తగ్గుతుందని అభిప్రాయపడ్డారు.
భారతీయ అనుబంధ సంస్థలలో ప్రస్తుతం ఉన్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితిని 74 శాతానికి పెంచడం.. సానుకూలమైన అంశంగా పేర్కొన్నారు సైనిక నిపుణులు. దీనివల్ల లాక్‌హీడ్ మార్టిన్, బోయింగ్, ఎయిర్‌బస్, డసాల్ట్ ఏవియేషన్ వంటి ప్రపంచ స్థాయి తయారీ సంస్థలు భారత్‌లో తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రోత్సాహం అందుతున్నారు. ఫలితంగా రక్షణ రంగంలో స్వదేశీ సాంకేతికతకు మరింత ఊతం లభిస్తుందని అన్నారు.
వామ పక్షల విమర్శలు
ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరించి ధనికులకు కట్టబెట్టడానికి.. మహమ్మారిని పావుగా వాడుకుంటోందని కేంద్రాన్ని విమర్శించింది వామపక్షాలు. "అధిక లాభాల కోసం విదేశీ, స్వదేశీ మూలధనాన్ని ధనికులకు అప్పగించి... జాతీయ ఆస్తులను కొల్లగొట్టడం ద్వారా కేంద్రం స్వయం సమృద్ధిని నాశనం చేస్తుంది" అని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఏచూరి సీతారాం పేర్కొన్నారు.
ఇదీ చూడండి: