తెలంగాణ

telangana

ETV Bharat / bharat

స్టార్ హోటళ్లకు లష్కరేతోయిబా బాంబు బెదిరింపులు! - బాంబు బెదిరింపు వార్తలు

దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో పలు స్టార్​ హోటళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. లష్కరే తోయిబా ఉగ్ర సంస్థ పేరుతో ఈమెయిల్స్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

Mumbai hotels get ''LeT'' threat mail
స్టార్ హోటళ్లకు లష్కరేతోయిబా బాంబు బెదిరింపులు!

By

Published : Feb 20, 2020, 5:52 AM IST

Updated : Mar 1, 2020, 10:08 PM IST

ముంబయిలో పలు లగ్జరీ హోటళ్లకు బాంబు బెదిరింపు ఈమెయిళ్లు రావడం కలకలం రేపింది. లీలా హోటల్​, హోటర్​ ప్రిన్సెస్, హోటల్​ పార్క్​, హోటల్​ రమదా ఇన్​లకు బాంబు బెదిరింపు మెయిళ్లు వచ్చినట్లు ముంబయి పోలీసులు తెలిపారు.

మెయిల్​ పంపిన వ్యక్తి లష్కరేతోయిబా ఉగ్ర సంస్థలో సభ్యుడినని పేర్కొన్నట్లు వెల్లడించారు.

ఈమెయిళ్ల కలకలంతో అప్రమత్తమైన పోలీసులు ఆయా హోటళ్లలో భద్రతను పటిష్ఠం చేసి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. వాటిలో ఎలాంటి అనుమానాస్పద ఆనవాళ్లు దొరకనందున అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయంపై దర్యాప్తు కొనసాగిస్తామని వెల్లడించారు.

ఇదీ చూడండి:ట్రంప్ పర్యటన నేపథ్యంలో దిల్లీలో భారీగా భద్రతా ఏర్పాట్లు

Last Updated : Mar 1, 2020, 10:08 PM IST

ABOUT THE AUTHOR

...view details