మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పుణెలోని కల్యాణ్ నగర్ రహదారిపై రెండు ట్రక్కులు ఢీకొన్న ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడిక్కడే మృతిచెందారు. ఓ డ్రైవర్‌కు తీవ్రంగా గాయాలవ్వగా.. స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే మృతులు ఎవరనేది ఇంకా స్పష్టత రాలేదు.
'మహా'లో ఘోర ప్రమాదం- నలుగురు మృతి - మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం
మహారాష్ట్ర పుణెలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు ట్రక్కులు ఢీకొని నలుగురు మరణించారు.
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
అలెఫాటా నుంచి కోళ్ల ఎరువుతో వెళ్తున్న ఓ ట్రక్కు.. వడ్గావ్ ఆనంద్ సమీపంలో ఎదురుగా వస్తోన్న మరో ట్రక్కును ఢీకొట్టడం వల్లే ఈ ప్రమాదం సంభవించింది.
ఇదీ చదవండి:ఆకాశంలో పటిష్ఠ నిఘా నేత్రం!