గురువారం తెల్లవారుజామున పంజాబ్ తరన్ తారన్ జిల్లా కైరాన్కు చెందిన పాత నేరస్తుడు బ్రిజ్‌లాల్, అతని కుమారుడు బంటీ, ఇద్దరు కోడళ్లు అమన్‌దీప్ కౌర్, జస్ప్రీత్ కౌర్, వారి డ్రైవర్ గురుసాహిబ్ను గుర్తుతెలియని వ్యక్తులు చంపారు.
మృతుల గొంతులు పదునైన కత్తితో కోసినట్లు ఉన్నాయని.. దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసు అధికారులు ప్రకటించారు.
ఐదుగురి హత్య.. మృతుల్లో నలుగురిది ఒకే కుటుంబం నేర నేపథ్యం
కుటుంబ పెద్ద, మృతుడు బ్రిజ్‌లాల్ మాదక ద్రవ్యాల వ్యాపారి. అతని భార్య రంజీత్ కౌర్ నార్కొటిక్ కేసులో ఖైదీగా ఉండి జైలులోనే ప్రాణాలు కోల్పోయింది. వీరికి నలుగురు కుమారులు. ఇందులో ముగ్గురు కుమారులు పరంజీత్, సోనూ, గుర్జంత్ సింగ్ మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారారు. ఘటనా సమయంలో పరంజీత్, సోనూ మత్తు పదార్థాల డీ అడిక్షన్ సెంటర్లో చికిత్స పొందుతుండటం, గుర్జంత్‌సింగ్ ఇంట్లో లేకపోవడం వల్ల వారు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
ఇదీ చూడండి:'రాజీవ్ ఫౌండేషన్‌కు చైనా ఇచ్చిన విరాళం ఏం చేశారు?'