తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య - Four of a family commits suicide by hanging themselves in Jaipur

అప్పుల ఊబిలో కూరుకుపోయి ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాజస్థాన్​ జైపుర్​లో జరిగింది. నగల వ్యాపారంలో నష్టం రావడం వల్లే ఈ ఘోరానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Four of a family commits suicide
ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య

By

Published : Sep 19, 2020, 5:47 PM IST

వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయిన ఓ కుటుంబం ఘోరానికి పాల్పడింది. అప్పుల ఊబిలో కూరుకుపోయి ఒకే కుటుంబంలో నలుగురు తనువు చాలించిన విషాద ఘటన.. రాజస్థాన్​ జైపుర్​లో జరిగింది.

జైపుర్ కనోటా పోలీస్​ స్టేషన్​ పరిధిలోని రాధిక విహాల్​ కాలనీలో శుక్రవారం రాత్రి నలుగురు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఫోరెన్సిక్​ బృందంతో సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. మృతులను యశ్వంత్​ సోని, మమత సోని, భారత్​, అజిత్​లుగా గుర్తించారు. ఇంటిలో ఎలాంటి సూసైడ్​ నోట్​ లభించలేదని పోలీసులు తెలిపారు.

అప్పుల బాధతోనే..

ఆత్మహత్యకు పాల్పడిన కుటుంబానికి జైపుర్​, అల్వార్​లో నగల దుకాణాలు ఉన్నాయని, భారీగా నష్టపోయిన క్రమంలో ఇటీవలే అమ్మకానికి పెట్టినట్లు తెలిసిందని పోలీసులు తెలిపారు.

నగల వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయారని, అప్పుల్లో కూరుకుపోయినట్లు స్థానికులూ చెప్పారు. వారికి అప్పు ఇచ్చిన ఓ మహిళ శుక్రవారం రాత్రి వారి ఇంటికి వచ్చి కొన్ని గంటల సమయం వరకు ఇక్కడే ఉన్నట్లు తెలిపారు. రాత్రి 8.30 గంటల ప్రాంతంలో వారిని చివరిసారిగా చూసినట్లు చుట్టుపక్కల వారు చెప్పారు.

ఇదీ చూడండి:చైనాకు సమాచారం చేరవేస్తున్న జర్నలిస్ట్​ అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details