జమ్ముకశ్మీర్ కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు ముష్కరులు హతమయ్యారు.
ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో హర్ద్మండ్ గురి గ్రామంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. బలగాలను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు కాల్పులు జరిపారు. సైన్యం దీటుగా స్పందించి నలుగురిని మట్టుబెట్టింది.