ఒడిశాలోని కేందుఝర్ జిల్లాలో బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్యూవీ కారు బోల్తా పడి నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటన పంద్పాడా ఠాణా పరిధిలోని సోమగిరి ప్రాంతంలో జరిగింది.
ఎస్యూవీ కారు బోల్తా- నలుగురు మృతి - కియోంజర్ జిల్లా వార్తలు
ఒడిశాలోని కేందుఝర్ జిల్లాలో ఓ ఎస్యూవీ కారు బోల్తా పడి నలుగురు మృతిచెందగా మరో నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఆ వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది.
కియోంజర్లో కారు బోల్తా-నలుగురు మృతి
మయూర్ భంజ్ జిల్లా హతబడాలకు చెందిన 11 మంది.. కారులో ప్రయాణిస్తున్నారు. హరిచందన్పూర్లోని జీరంగ్ సమీప ప్రాంతానికి చేరగానే అదుపుతప్పిన వాహనం .. చెట్టును ఢీకొట్టి బోల్తా పడింది. వెంటనే.. బాధితులను కేందుఝర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు స్థానికులు. నలుగురు మృతిచెందగా.. మిగతా వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
ఇదీ చదవండి:నిషేధాలు, ఆంక్షల నడుమ.. న్యూఇయర్