తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీలో ఉగ్రకుట్ర భగ్నం- కశ్మీరీ యువకులు అరెస్ట్​ - దిల్లీలో ఉగ్రదాడి కుట్ర

దిల్లీలో.. కశ్మీర్​కు చెందిన నలుగురు యువకులను స్పెషల్​ టీం పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా దేశ రాజధానిలో ఉగ్రదాడికి కుట్ర పన్నినట్టు ప్రత్యేక బృందం డీసీపీ ప్రమోద్​ కుష్వా వెల్లడించారు.

Four Kashmiri youth planning terror attack arrested in Delhi
దిల్లీలో ఉగ్ర కుట్ర భగ్నం- కశ్మీరీ యువకులు అరెస్ట్​

By

Published : Oct 3, 2020, 10:28 PM IST

దేశ రాజధాని దిల్లీలో నలుగురు కశ్మీర్​ యువకులను స్పెషల్​ సెల్​ బృందం అదుపులోకి తీసుకుంది. దిల్లీలో ఉగ్రదాడికి వీరు కుట్ర పన్నినట్టు అధికారులు వెల్లడించారు. వీరి నుంచి భారీగా మందుగుండు సామాగ్రితో పాటు నాలుగు తుపాకులను స్వాధీనం చేసుకునట్టు తెలిపారు. పక్కా సమాచారంతో నిందితుల వాహనాన్ని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నట్లు స్పెషల్​ సెల్​ డీసీపీ ప్రమోద్​ కుష్వా స్పష్టం చేశారు.

వీరంతా అన్సర్ ఘజ్వత్-ఉల్-హింద్ అనే ఉగ్రవాద సంస్థకు చెందిన వారని పోలీసులు తెలిపారు. అన్సర్ ఘజ్వత్-ఉల్-హింద్ అధినేత బుర్​హన్​ కోక ఏప్రిల్​ 29న సైన్యం చేతిలో ఎన్​కౌంటర్​ కాగా అందుకు ప్రతీకారంగా అతని తమ్ముడు ఇష్ఫాక్ మజీద్ దిల్లీలో విధ్వంసానికి ప్రణాళిక రచించినట్టు వెల్లడించారు. ఈ మేరకు మారణాయుధాలు కోనుగోలు చేయడానికి సంబంధించిన సొమ్ము అతని బ్యాంక్​ ఖాతాలో ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

ఇదీ చూడండి:-సైన్యం కళ్లుగప్పేందుకు ఉగ్రవాదుల నయా ట్రెండ్​

ABOUT THE AUTHOR

...view details