తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మరో 'పుల్వామా' దాడికి కుట్ర- భగ్నం చేసిన భద్రతా దళం - మరో 'పుల్వామా' దాడికి కుట్ర- భగ్నం చేసిన భద్రతా దళం

జమ్ముకశ్మీర్​లో మరోసారి 'పుల్వామా' తరహా దాడి చేసేందుకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను భగ్నంచేశాయి భద్రతా బలగాలు. జమ్ము-పూంచ్ జాతీయ రహదారిపై శక్తిమంతమైన ఐఈడీని పసిగట్టి, ధ్వంసం చేశాయి.

మరో 'పుల్వామా' దాడికి కుట్ర- భగ్నం చేసిన భద్రతా దళం

By

Published : Nov 19, 2019, 3:31 PM IST


జమ్ముకశ్మీర్​లో అలజడి సృష్టించేందుకు మూడు వేర్వేరు చోట్ల జరిగిన ఉగ్ర కుట్రల్ని భద్రతా బలగాలు భగ్నం చేశాయి.

జాతీయ రహదారిపై బాంబు

పుల్వామా తరహాలో మరో భారీ ఉగ్రదాడికి ముష్కరులు ప్రయత్నించగా భద్రతా సిబ్బంది తిప్పికొట్టారు. పూంచ్​ జిల్లా కల్లార్​ మోడ్​ ప్రాంతంలో జమ్ము​-పూంచ్​ జాతీయ రహదారిపై శక్తిమంతమైన పేలుడు పదార్ధాలను గుర్తించారు. కాసేపు ఆ మార్గంలో రాకపోకలు నిలిపేశారు. అతి కష్టం మీద ఆ ఐఈడీలను నిర్వీర్యం చేశారు.
ఆ ప్రాంతంలో ఇంకేమైనా పేలుడు పదార్ధాలు ఉన్నాయేమో గుర్తించడం సహా దాడికి యత్నించిన ముష్కరులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు అధికారులు.

జమ్ములో ఉగ్రస్థావరం

పూంచ్​ జిల్లాలో ఓ రహస్య ఉగ్రస్థావరం బయటపడింది. సురన్​కోటేలో కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరగడంపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ధైర్​ అటవీ ప్రాంతంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 7 ఐఈడీలు, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.

నలుగురు ఉగ్రవాదులు అరెస్ట్​

జులైలో పుల్వామాలో జరిగిన ఓ ఉగ్రదాడితో సంబంధమున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఐర్హల్​ ప్రాంతానికి చెందిన వీరు విదేశీ ఉగ్రవాదులతో నిరంతర సంప్రదింపులు జరుపుతున్నట్లు కొంతకాలం క్రితం గుర్తించారు. వీరికి జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు పక్కా ఆధారాలు సేకరించారు. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి:శ్రీలంకలో మళ్ళీ రాజపక్స ఏలుబడి!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details